నాలుగు కొత్త లేబర్ కోడ్‌ అములుకు కేంద్రం నోటిఫికేషన్..

నాలుగు కొత్త లేబర్ కోడ్‌ అములుకు కేంద్రం నోటిఫికేషన్

Advertisements

<p>ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న నాలుగు కొత్త లేబర్ కోడ్‌లను పూర్తిస్థాయిలో అమల్లోకి తెస్తూ కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేసింది&period; దాదాపు 29 పాత చట్టాల స్థానంలో వచ్చిన ఈ కొత్త నిబంధనలు కార్మికుల పనితీరు&comma; వేతనం&comma; సామాజిక భద్రతపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపనున్నాయి&period; ఈ మార్పుల వల్ల అటు కంపెనీలకు నిబంధనల సరళీకరణతో పాటు&comma; ఇటు కార్మికులకు మెరుగైన హక్కులు కల్పించడమే లక్ష్యమని ప్రభుత్వం పేర్కొంది&period; 2025 నవంబర్‌లోనే ఇవి చట్టాలుగా మారాయని&comma; డ్రాఫ్ట్ రూల్స్ పబ్లిష్ చేసి భాగస్వాముల సూచనలు కోరారని ఓ అధికారి వివరించారు&period; వాటిని న్యాయ పరీక్ష చేసి తాజాగా నోటిఫై చేస్తూ గెజిట్ విడుదల చేయడంతో ఈ లేబర్ కోడ్ చట్టాల అమలుకు అవసరమైన ప్రక్రియ ముగిసిందని తెలిపారు&period; అయితే&comma; కార్మిక శాఖ ఉమ్మడి జాబితాలో ఉండే అంశమని&comma; అందుకే రాష్ట్రాలు కూడా నోటిఫై చేస్తే&period;&period; ఆయా రాష్ట్రాల్లో అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;<p>కొత్త నిబంధనల ప్రకారం వారానికి పని గంటలను గరిష్టంగా 48 గంటలుగా నిర్ణయించారు&period; కార్మికులకు వారానికి ఒక రోజు సెలవు ఇవ్వడం తప్పనిసరి చేయడంతో పాటు&comma; అదనపు సమయం పనిచేస్తే దానికి తగ్గట్టుగా ఓవర్‌ టైమ్ భత్యాన్ని చెల్లించాల్సి ఉంటుంది&period; అలాగే&comma; పారదర్శకత కోసం ప్రతి ఉద్యోగికీ తప్పనిసరిగా నియామక పత్రం జారీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది&period; 40 ఏళ్లు దాటిన కార్మికులకూ ఏటా ఉచితంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించడంతో పాటు&comma; రాత్రి వేళల్లో పనిచేసే మహిళా ఉద్యోగులకు పటిష్టమైన భద్రత కల్పించే బాధ్యతను యజమానులకే అప్పగించారు&period;<br &sol;>&NewLine;ఈ మార్పుల వల్ల నెలవారీ చేతికి వచ్చే జీతంలో మార్పులు వచ్చే అవకాశం ఉంది&period; కొత్త వేతన నిబంధనల ప్రకారం&period;&period; ఉద్యోగి మొత్తం జీతంలో ప్రాథమిక వేతనం కనీసం 50 శాతంగా ఉండాలి&period; దీనివల్ల నెలవారీగా చేతికి అందే నగదు స్వల్పంగా తగ్గినప్పటికీ&period;&period; పీఎఫ్&comma; గ్రాట్యుటీ వాటా పెరగడం వల్ల పదవీ విరమణ తర్వాత కార్మికులకు భారీగా ఆర్థిక ప్రయోజనం చేకూరుతుంది&period; మరోవైపు&comma; ఇప్పటివరకు ఎలాంటి భద్రత లేని డెలివరీ బాయ్స్ వంటి గిగ్ వర్కర్లను కూడా సామాజిక భద్రత పరిధిలోకి తీసుకురావడం విశేషం&period; రాష్ట్ర ప్రభుత్వాలు తమ పరిధిలోని నిబంధనలను ఖరారు చేసిన వెంటనే ఇవి క్షేత్రస్థాయిలో అమల్లోకి రానున్నాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..