కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah):
కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. జమ్మూ కాశ్మీర్(Jammu and Kashmir) నుంచి కేంద్ర సాయుధ బలగాల ఉపసంహరణపై సమీక్షిస్తామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో సాయుధ బలగాల చట్టాన్ని రద్దు చేసే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుందని అన్నారు. సైన్యాన్ని ఉపసంహరించుకొని శాంతిభద్రతలను జమ్మూ కాశ్మీర్ పోలీసుల(Jammu and Kashmir Police)కే అప్పగించేందుకు ప్రభుత్వం యోచిస్తోందని చెప్పారు. సెప్టెంబర్‌లోపు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. కేంద్ర బలగాలను ఉపసంహరించుకొని అక్కడి శాంతిభద్రతలను జమ్మూ కాశ్మీర్ పోలీసులకు వదిలివేయాలనే ప్రణాళికలు తమ వద్ద ఉన్నాయని తెలిపారు. ఏఎఫ్ఎస్పీఏ చట్టం కేంద్ర సాయుధ బలగాలకు ప్రత్యేక అధికారాలను కల్పిస్తోంది. ప్రభుత్వ ఆదేశాల నిర్వహణలో భాగంగా కేంద్ర బలగాలకు శోధనలు చేపట్టడానికి, అరెస్టులు, అవసరమైతే కాల్పులు చేపట్టడానికి ఈ చట్టం విస్తృత అధికారాలను కల్పిస్తోంది. సాయుధ బలగాల కార్యకలాపాలను సులభతరం చేయడానికి ఈ చట్టాన్ని రూపొందించారు. కాగా జమ్మూ కాశ్మీర్లో ప్రస్తుతం ఏఎఫ్ఎస్పీఏ చట్టం అమల్లో ఉన్నప్పటికీ రాష్ట్రంలోని 70 శాతం ప్రాంతాల్లో చట్టాన్ని వెనక్కి తీసుకున్నామని గతంలో అమిత్ షా చెప్పారు. కాగా ఈ చట్టాన్ని ఉపసంహరించుకోవాలంటూ జమ్మూ కాశ్మీర్‌తో పాటు పలు ఈశాన్య రాష్ట్రాల్లోని పలు సంస్థలు కూడా డిమాండ్ చేస్తున్నాయి.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇది చదవండి: దేశ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి