Thursday, September 17, 2026
News Navigation
Thursday, September 17, 2026
News Navigation

Breaking

Thursday, September 17, 2026
Home Telangana తెలంగాణలో 18 జిల్లాలు ఔట్?

తెలంగాణలో 18 జిల్లాలు ఔట్?

by Rama
Revanth reddy

తెరపైకి మరోసారి జిల్లాల పునర్విభజన అంశం.

తెలంగాణ (Telangana)లో ఇప్పుడున్న 33 జిల్లాలను కుదిస్తూ 17 లోక్ సభ నియోజకవర్గాలను జిల్లాలను ప్రకటించనున్న కాంగ్రెస్ ప్రభుత్వం?

ఈ సంచలన వార్తను ఒక ప్రముఖ ఆంగ్ల పత్రిక ప్రచురించడంతో రాష్ట్రంలో ప్రకంపనలు.

ఇది రేవంత్ మరో పిచ్చి తుగ్లక్ పని అంటున్న ప్రజలు.

ఈ నిర్ణయం అమలైతే రద్దు కాబోయే జిల్లాలు:

ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, సిరిసిల్ల, సంగారెడ్డి, సిద్దిపేట, కామారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, నారాయణపేట, గద్వాల్, వనపర్తి, జనగాం, సూర్యాపేట, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం

ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ఇవ్వాళ ప్రచురించిన కథనం ప్రకారం ఓ కాంగ్రెస్ నాయకుడు మాట్లాడుతూ లోక్ సభ ఎన్నికల్లో లబ్ది పొందేందుకు ప్రస్తుతం ఉన్న 33 జిల్లాలను కుదించి 17 లోక్ సభ నియోజకవర్గాలను నూతన జిల్లాలుగా ప్రకటించనున్నట్లు తెలిపారు.

సీఎం రేవంత్ రెడ్డి సైతం ఇటీవలే 33 జిల్లాల్లో కొన్ని రద్దు చేసే అంశం పరిశీలిస్తున్నట్లు తెలిపిన విషయం తెలిసిందే.

ఇప్పటికే కొత్త జిల్లాలు కుదురుకుంటున్న సమయంలో వచ్చిన ఈ వార్తతో తెలంగాణ అంతటా ప్రజల్లో ఆందోళన, అయోమయం.

కొత్త జిల్లాల పునర్విభజన చేస్తే జరిగే పరిణామాలు:

1️⃣ రద్దు చేయబోయే జిల్లాల్లో వ్యవసాయ భూముల ధరలు పడిపోయి రైతులకు తీవ్ర నష్టం. రియల్ ఎస్టేట్ కూడా ఢమాల్.

2️⃣ జిల్లా ప్రభుత్వ ఉద్యోగుల పదోన్నతుల రద్దు, మళ్ళీ భారీ బదిలీలు. ప్రభుత్వ యంత్రాంగం అస్తవ్యస్తం.

3️⃣ విద్యార్థుల పాఠ్యాంశాలు, కేంద్ర, రాష్ట్ర శాఖల పునర్వ్యవస్థీకరణ చేయాలి, ఉన్న మ్యాప్ లన్ని తిరగరాయాలి

4️⃣ పోటీ పరీక్షల సిలబస్ మార్చాలి. జోనల్ విధానం మార్చాలి. రెండేళ్ల పాటు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడం వీలు కాదు.

5️⃣ ఇప్పుడున్న జిల్లా సమీకృత కలెక్టరేట్లు, ఎస్పీ భవనాలు ఇతర జిల్లా కేంద్ర ఆఫీస్ నిర్మాణాలు నిరుపయోగం.

పార్లమెంటు ఎన్నికల ముంగిట రేవంత్ సర్కార్ ఈ వివాదాస్పద నిర్ణయం తీసుకుంటే రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ కు షాక్ ఇవ్వడం ఖాయం అని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

ఇది చదవండి: ఇంటికి కిలో బంగారమిచ్చినా మీకు ఓటమి తప్పదు జగన్!


శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.
హైదరాబాద్ ఉప్పల్ భగాయత్‌లో ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా …
కొండా సురేఖకు బుజ్జగింపులు.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి మీనాక్షి నటరాజన్, …
ఫసల్ బీమా యోజన అమలుపై పాయల్ శంకర్ నిరసన.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఫసల్ బీమా యోజన అమలుపై బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ …

Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: