నేడు కాంగ్రెస్(Congress Party) వర్కింగ్ కమిటీ..
నేడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ.. సీడబ్ల్యూసీ, కాంగ్రెస్ ఎన్నికల కమిటీ.. సీఈసీ సమావేశం కానుంది. ఈ సమావేశానికి తెలంగాణ(Telangana) సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) హాజరుకానున్నారు. ఆదివారం రాహుల్ న్యాయ్ యాత్ర ముగింపు సభలో పాల్గొనేందుకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), మంత్రులు అటు నుంచి నేరుగా ఢిల్లీ కి వెళ్లారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సీడబ్ల్యూసీ, సీఈసీ మీటింగ్లో పాల్గొననున్నారు. కాగా, నేడు జరిగే సమావేశంలో లోక్ సభ అభ్యర్థుల ఎంపిక తదితర అంశాలపై చర్చించనున్నా రు.
నేటి సీఈసీ సమావేశం..
ఇప్పటికే తెలంగాణ నుంచి తొలి జాబితాలో కాంగ్రెస్ నలుగురు అభ్యర్థులను ప్రకటించగా మిగిలిన 13 మంది అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నారు. అయితే నేటి సీఈసీ సమావేశంలో అభ్యర్థులను ఫైనల్ చేయనున్నట్లుగా తెలుస్తోంది. అయితే అందులో 9 మందితో కూడిన జాబితాను ఈ రోజు రాత్రిలోగా ఏఐసిసి ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి.
సీడబ్ల్యూసీ, కాంగ్రెస్ ఎన్నికల కమిటీ..
మిగిలిన నాలుగు స్థానాలైన.. ఖమ్మం, నాగర్ కర్నూల్, మల్కాజ్ గిరి, భువనగిరి స్థానాలను పెండింగ్లో పెట్టి నాలుగైదు రోజుల్లో ఆ స్థానాల అభ్యర్థులను వెల్లడించే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. ఈ నాలుగు స్థానాలను చివరి దాకా లాగి ఫ్లాష్ సర్వే, అప్పటి పరిస్థితులను బేరీజు వేసుకున్న తరువాత ఫైనల్ చేస్తారన్న చర్చ సాగుతోంది. మరోవైపు సీడబ్ల్యూసీ(CWC) సమావేశంలో కాంగ్రెస్ మేనిఫెస్టోను ఆమోదించడంతో పాటు ఎన్నికల ప్రచారం, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కాంగ్రెస్(Congress) హైకమాండ్ నేతలకు దిశానిర్ధేశం చేయనున్నట్టుగా తెలిసింది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: కవితను కస్టడీలోకి తీసుకున్న ఈడీ…
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి