తమ డిమాండ్ల సాధన కోసం ఢిల్లీ చలోకు రైతులు సిద్ధమవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నేడు మరో దఫా చర్చలు జరిపేందుకు ఆహ్వానించింది. అన్నదాతల డిమాండ్ల పరిష్కారం దిశగా ఈ సమావేశంలో సమాలోచనలు జరిగే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు ‘ఢిల్లీ చలో’కు తాము మద్దతిస్తున్నట్లు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. గత పదేళ్ల బీజేపీ పాలనలో అన్నదాతలు నాశనమయ్యారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు రేపు ‘ఢిల్లీ చలో’ పేరుతో ఆందోళన చేపట్టాలని అన్నదాతలు నిర్ణయించిన నేపథ్యంలో హర్యానా, ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. పలుచోట్ల సరిహద్దులను మూసివేస్తూ భారీగా బలగాలను మోహరిస్తున్నారు. ‘ఢిల్లీ చలో’ ఆందోళనలో పాల్గొనేందుకు వివిధ రాష్ట్రాల నుంచి దాదాపు 20వేల మంది రైతులు ఢిల్లీకి వచ్చే అవకాశాలు ఉన్నాయని నిఘా వర్గాలు అంచనా వేశాయి.
మరిన్నితాజావార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Follow us on : Facebook, Instagram & YouTube.