బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు కేంద్ర ఎన్నికల సంఘం వేర్వేరుగా లేఖలు రాసింది. కేంద్రమంత్రి అమిత్ షా, ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీలపై ఫిర్యాదుల నేపథ్యంలో ఈ నెల 18వ తేదీ మధ్యాహ్నం 1 గంటలోపు అధికారిక వివరణ ఇవ్వాలని పార్టీల అధ్యక్షులకు రాసిన లేఖలో ఆదేశించింది. రాహుల్ గాంధీ తన ప్రసంగంలో ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారని ఈసీకి బీజేపీ ఫిర్యాదు చేసింది. మరోవైపు, అమిత్ షా కూడా కోడ్ను ఉల్లంఘించారని కాంగ్రెస్ ఈసీ వద్దకు వెళ్లింది. ఈ నేపథ్యంలో నేతలపై వచ్చిన ఫిర్యాదులపై వివరణ ఇవ్వాలని ఈసీ ఈ లేఖ రాసింది. అంతేకాదు, ఈ ఫిర్యాదులను ఇరుపక్షాలకు అందించింది.
అధ్యక్షులకు రాసిన లేఖలో, ఇటీవల లోక్ సభ ఎన్నికల సందర్భంగా స్టార్ క్యాంపెయినర్లకు చేసిన సూచనలను ప్రస్తావించింది. జాతీయ పార్టీల స్టార్ క్యాంపెయినర్లు ఆదర్శంగా ఉండాలని, సమాజాంలోని సున్నితమైన కూర్పును చెడగొట్టవద్దని లోక్ సభ ఎన్నికల సమయంలో ఈసీ సూచించింది. ప్రచారంలో సంయమనం ఉండాలని పేర్కొంది.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- నైజీరియాలో ప్రధాని మోదీ పర్యటనమూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ తొలి విడతగా నైజీరియా రాజధాని అబుజా చేరుకున్నారు. ప్రధాని మోదీ అబుజా చేరుకోగానే అక్కడ ఉన్న భారతీయ ప్రవాసులు ఆయనకు డప్పువాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. దీంతో పాటు…
- వచ్చే ఎన్నికల నాటికి బీఆర్ఎస్ కనుమరుగైపోవడం ఖాయంకాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆరు గ్యారంటీలపై తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ మహేశ్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆరు గ్యారంటీలను చాలా వరకూ అమలు చేశామని తెలిపారు. తెలంగాణ ప్రజలు 11 నెలల్లోనే మెరుగైన పాలన చూశారని…
- వేములవాడ రాజన్న అభివృద్ధికి 50 కోట్లురాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఈనెల 20న సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాను ధార్మిక కార్మిక క్షేత్రంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. వేములవాడలో సీఎం పర్యటన…
- అసెంబ్లీకి రా జగన్ చూసుకుందాం…ఏపీ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల్లో భాగంగా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 43 మంది కాంట్రాక్టర్లు జగన్ ప్రభుత్వంలో ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. పనులు చేసి డబ్బులు రాకపోతే అప్పులు చేసి,..…
- జేపీ నడ్డా, మల్లికార్జున ఖర్గేకు ఈసీ షాక్బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు కేంద్ర ఎన్నికల సంఘం వేర్వేరుగా లేఖలు రాసింది. కేంద్రమంత్రి అమిత్ షా, ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీలపై ఫిర్యాదుల నేపథ్యంలో ఈ నెల 18వ తేదీ…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి