అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) అరెస్టుపై వివాదాస్పద ప్రకటన విడుదల..
ఢిల్లీ ముఖ్యమంత్రి(Chief Minister of Delhi), ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై జర్మనీ స్పందించిన తీరు పట్ల భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఇది పూర్తిగా భారత అంతర్గత వ్యవహరాలలో జోక్యం చేసుకోవడమేనని దుయ్యబట్టింది. ఈ మేరకు ఢిల్లీలోని జర్మనీ రాయబారిని పిలిచి ఆ దేశం చేసిన ప్రకటనపై విదేశీ వ్యవహారాల శాఖ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. భారత్(India) ఒక ప్రజాస్వామ్య దేశం. న్యాయవ్యవస్థ స్వయంప్రతిపత్తి, కనీస ప్రజాస్వామ్య సూత్రాలు భారత్‌కూ వర్తిస్తాయి. అందరిలానే నిష్పక్షపాత, న్యాయబద్ద విచారణకు కేజ్రీవాల్ అర్హుడు. అరెస్టు చేయకుండా కూడా అతడిని విచారించవచ్చు. దోషిగా తేలనంత వరకు నేరం చేయనట్లే భావించాలనే సూత్రం కేజ్రీవాల్‌కు కూడా వర్తిస్తుంది” అని జర్మనీ ఢిల్లీ సీఎం అరెస్టుపై వివాదాస్పద ప్రకటన ఒకటి విడుదల చేసింది. ఇదే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఆగ్రహానికి కారణంగా తెలుస్తోంది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: మద్యం కుంభకోణంలో అరవింద్ కేజ్రీవాల్..
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి