దేశవ్యాప్తంగా ఉన్న NITలు, IIITల్లో Btech, బీఆర్క్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) 2025 జవనరి సెషన్ కోసం దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. అయితే గడువు సమయం ముగిసే నాటికి దరఖాస్తు ప్రక్రియ ఊపందుకుంది. సుమారు 13 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. JEE జనవరి సెషన్‌కు అక్టోబర్ 28 నుంచే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైనా.. మొదటి రెండు వారాల్లో కేవలం 5.10లక్షల మంది మాత్రమే నమోదు చేసుకున్నారు. దీంతో ఈ సారి JEE మెయిన్‌కు దరఖాస్తుల సంఖ్య తగ్గే అవకాశం ఉందని అందరూ అనుకున్నారు. అప్లికేషన్లో తీసుకొచ్చిన కొత్త విధానాలు, అర్హత ప్రమాణాలు విద్యార్ధులను గందరగోళానికి గురిచేసింది. ముఖ్యంగా దరఖాస్తు సమయంలో కొన్ని ప్రత్యేక సర్టిఫికెట్లు అప్లోడ్ చేయాల్సి రావడంతో అప్పటికప్పుడు అవి దొరక్క విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు.
నవంబర్ 22వ తేదీన గడువు సమయం ముగిసే నాటికి దాదాపు 13.8లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. అయితే గత ఏడాదితో పోల్చితే దరఖాస్తులు స్వల్పంగా తగ్గినట్లు తెలుస్తుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఎన్టీఏ ఇంకా ప్రకటించలేదు. కాగా జవనరి 22 నుంచి 31వరకు తొలి సెషన్ పరీక్షలు, ఏప్రిల్ 1 నుంచి 8 వరకు రెండో సెషన్ పరీక్షలకు ఇప్పటికే NDA షెడ్యూల్ ప్రకటించింది. జనవరి 19 నుంచి అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- నెరవేరనున్న ఏపీ ప్రజల చిరకాల వాంఛరైల్వే శాఖకు సంబంధించి రాష్ట్ర ప్రజల చిరకాల వాంఛ నెరవేరబోతోంది. ఏళ్లుగా ఊరిస్తున్న దక్షిణకోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు కీలక ముందడుగు పడింది. విశాఖ కేంద్రంగా జోన్ కార్యకలాపాల కోసం భవనాల నిర్మాణానికి రైల్వేశాఖ టెండర్లు ఆహ్వానించింది. జోన్…
- విజయవాడ మేయర్ కు పదవీ ముప్పువిజయవాడ నగరపాలక సంస్థలో మేయర్ కు పదవీ ముప్పు తప్పేలా లేదు. ఎన్నికలకు ముందు నగరపాలక సంస్థలో 49 మంది కార్పొరేటర్లతో ఉన్న వైసీపీ బలం ప్రస్తుతం 38కి తగ్గిపోయింది. వీరిలోనూ మరో 10 మందికిపైగా కూటమి పార్టీల…
- ఆదాయాన్ని పెంచడానికి .. సామాన్యులపై రోడ్ టాక్స్ భారంపెట్రల్, డీజిల్ తో నడిచే నూతన వాహనాలకు విధించే రోడ్ ట్యాక్స్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. పొరుగు రాష్ట్రాల్లో వాహనాల ద్వారా వస్తున్న ఆదాయం, రిజిస్ట్రేషన్ విధానం తదితర అంశాలపై రాష్ట్ర రవాణా…
- JEE పరీక్షల షెడ్యూల్ విడుదల ..దేశవ్యాప్తంగా ఉన్న NITలు, IIITల్లో Btech, బీఆర్క్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) 2025 జవనరి సెషన్ కోసం దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. అయితే గడువు సమయం ముగిసే నాటికి దరఖాస్తు ప్రక్రియ ఊపందుకుంది.…
- ఒకే వేదికపై పొన్నం, హరీశ్ రావురాజకీయాల్లో నిత్యం విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకునే నేతలు ఒకే వేదికపై సరదాగా గడిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి హరీశ్ రావు క్రికెట్ ఆడారు. ఓ కార్యక్రమానికి హాజరైన వీరిద్దరూ స్టేజిపై క్రికేట్ ఆడి అక్కడున్నవారిలో…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి