56
మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీ ల్యాండరింగ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ఈడీ విచారణకు హాజరుకావడం లేదు. దర్యాప్తు సంస్థ ఇప్పటివరకు ఐదుసార్లు సమన్లు ఇవ్వగా.. ఆయన ఒక్కసారి కూడా విచారణకు వెళ్లలేదు. ఆయన్ను అరెస్టు చేసే ఉద్దేశంతోనే ఈడీ పదేపదే నోటీసులు ఇస్తోందని ఆమ్ఆద్మీ పార్టీ ఆరోపిస్తోంది. ఈ రోజు కూడా ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ నేషనల్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఈడీ విచారణకు హాజరుకావడం లేదని పార్టీ నేతలు తెలిపారు. మేం చట్టబద్ధమైన సమన్లకు కట్టుబడి ఉంటామని కేజ్రీవాల్‌ను అరెస్టు చేయడం, ఢిల్లీ ప్రభుత్వాన్ని కూల్చడమే ప్రధాని మోదీ లక్ష్యమని పార్టీ నాయకులు ఆరోపించారు.