మాటలను వక్రీకరించి.. సోషల్ మీడియాలో షేర్ చేసి జనాల్లో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేశారంటూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీనియర్ జైరాం రమేశ్‌లకు కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరీ లీగల్ నోటీసులు జారీ చేశారు. ఇంటర్వ్యూలో ఏ సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారో తెలిసి కూడా ఉద్దేశపూర్వకంగా సందర్భోచిత అర్థాన్ని దాచిపెట్టి వీడియోను కట్ చేశారు.
ఇది చదవండి: కుర్చీలాటలో పైచేయి సాధించిన కాంగ్రెస్…
సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ఉద్దేశపూర్వకంగా ప్రయత్నించారని గడ్కరీ తరపున న్యాయవాది నోటీసులు పంపించారు. సోషల్ మీడియా పోస్ట్‌ను కాంగ్రెస్ పార్టీ ఉపసంహరించుకోవాలని, మూడు రోజుల్లో నితిన్ గడ్కరీకి లిఖితపూర్వకంగా క్షమాపణలు చెప్పాలని నోటీసుల్లో స్పష్టం చేశారు. ఈ నోటీసులకు స్పందించకుంటే సివిల్, క్రిమినల్ వ్యాజ్యాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి.