Panneerselvam:
అన్నాడీఎంకే బహిష్కృత సీనియర్ నేత, తమిళనాడు(Tamil Nadu) మాజీ సీఎం పన్నీర్ సెల్వంను ప్రసన్నం చేసుకునే దిశగా బీజేపీ(BJP) పావులు కదుపుతోంది. అన్నాడీఎంకేపై ఆయనను అస్త్రంగా వాడుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. దీనిలో భాగంగా రామనాథపురం లోక్‌సభ నియోజకవర్గం నుంచి పన్నీర్ సెల్వంను స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దింపాలని బీజేపీ వ్యూహం రచిస్తోంది. ఇందులో భాగంగా ఆ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిని కూడా పోటీలో దించబోమని పన్నీర్‌సెల్వంకు కాషాయ పార్టీ పెద్దలు హామీ ఇచ్చినట్లు సమాచారం. ఇక ఈసారి కూడా లోక్‌సభ ఎన్నికల్లో భారీగా సీట్లు దక్కించుకోవాలనే ప్రణాళికతో బీజేపీ ముందుకు వెళ్తున్న విషయం తెలిసిందే. కనీసం 400 సీట్ల వరకు సాధించి మూడోసారి అధికారంలోకి రావాలని బీజేపీ గట్టిగా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా కలిసొచ్చే ఏ అవకాశాన్ని కూడా కాషాయ పార్టీ వదులుకోవడానికి సిద్ధంగా లేదు. ప్రధానంగా దక్షిణాదిలో పట్టు సాధించాలనే పట్టుదలతో ఉంది. ఆ దిశగానే పార్టీ అధిష్ఠానం వ్యూహాలు రచిస్తోంది కూడా. దీనిలో భాగంగా ఇప్పుడు పన్నీర్ సెల్వంకు పూర్తి మద్దతు ప్రకటించింది.
Follow us on : Google Newsమరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇది చదవండి: చైనా ప్రవర్తనపై మండిపడ్డ జైశంకర్
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి