Sunday, July 12, 2026
News Navigation
Sunday, July 12, 2026
News Navigation

Breaking

Sunday, July 12, 2026
Home National చైనా ప్రవర్తనపై మండిపడ్డ జైశంకర్

చైనా ప్రవర్తనపై మండిపడ్డ జైశంకర్

by Satya
Jaishankar


Jaishankar:

ఉగ్రవాదాన్ని తేలికగా తీసుకునే స్థితిలో భారత్(India) లేదని అన్నారు విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్. సింగపూర్(Singapore) పర్యటనలో భాగంగా నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్(National University of Singapore) కు చెందిన ఓ ఇనిస్టిట్యూట్(Institute) లో ప్రసంగించారు. పాక్, చైనాల చర్యలను ఖండించారు. పాక్ ఉగ్రవాద పరిశ్రమలా పని చేస్తోందని మండిపడ్డారు. అయితే భారత్ ఉగ్రవాదాన్ని చూస్తూ ఊరుకోదని స్పష్టం చేశారు. సమస్యలకు పరిష్కారాలు వెతకాలని సూచించారు. సమస్య నుంచి తప్పించుకోవడం వల్ల తిరిగి ఇబ్బందులే ఎదురవుతాయని అన్నారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ప్రతి దేశం పొరుగు దేశంతో సత్సంబంధాలు కోరుకుంటుందన్నారు. పాక్ తో సంబంధాల కోసం ఉగ్రవాదాన్ని అయితే చూసీచూడనట్టు వదిలేయం అని క్లియర్ గా చెప్పారు జైశంకర్. మరోవైపు చైనా ప్రవర్తనపైనా జైశంకర్ మండిపడ్డారు. సేలా సొరంగ మార్గాన్ని మోడీ ఇటీవలే ప్రారంభించారు. అయితే అది తమ భూభాగమని.. సరిహద్దు వివాదం భారత్ వల్లే ముదురుతుందన్న చైనా మాటలను కొట్టిపారేశారు జైశంకర్. చైనా వ్యాఖ్యలు ఓ జోక్ అని.. అరుణాచల్ ప్రదేశ్ భారత భూభాగం అని నొక్కి చెప్పారు.

ఇది చదవండి: దేశానికి తాగునీటి గండం..


గగన్‌యాన్ మిషన్‌లో కీలక మైలురాయి సాధించిన ఇస్రో.
భారత తొలి మానవ అంతరిక్ష యాత్ర గగన్‌యాన్ మిషన్‌లో ఇస్రో మరో కీలక విజయాన్ని నమోదు …
చెన్నై ఎగ్మూర్‌లోని ఆస్పత్రుల్లో సీఎం విజయ్‌ ఆకస్మిక తనిఖీలు.
తమిళనాడు సీఎం విజయ్ పాలనలో తన మార్క్‌ చూపిస్తున్నారు. అవినీతి లేని పాలన అందిస్తానని చెబుతున్న …
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలపై భారత్‌ ఆందోళన.
పశ్చిమాసియాలో తాజా ఉద్రిక్త పరిస్థితులపై భారత్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అంతర్జాతీయ జలమార్గాల మీదుగా …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

039763
Total views : 200788

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: