Friday, July 10, 2026
News Navigation
Friday, July 10, 2026
News Navigation

Breaking

Friday, July 10, 2026
Home Andhra Pradesh Chandrababu : ఈ నెల 27నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం

Chandrababu : ఈ నెల 27నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం

by Satya
cbn


ఈ నెల 27 నుంచి 31 వరకు చంద్రబాబు(Chandrababu) పర్యటన షెడ్యూల్:

ఎన్నికల షెడ్యూల్(Election Schedule) విడుదలైన నేపథ్యంలో, టీడీపీ అధినేత చంద్రబాబు ఈ నెల 27న ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఏపీలో మే 13న ఒకే విడతలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు(Lok Sabha Elections) జరగనుండగా, ప్రజల్లోకి మరింత బలంగా వెళ్లాలని చంద్రబాబు నిర్ణయించారు. చంద్రబాబు ‘ప్రజాగళం’ పేరుతో ఎన్నికల ప్రచారం, సభలు, రోడ్ షోలు నిర్వహించనున్నారు. రోజుకు 3 నుంచి 4 నియోజకవర్గాల్లో సభలు, రోడ్ షోలు జరిగేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. తొలి విడతలో ఈ నెల 27 నుంచి 31 వరకు చంద్రబాబు పర్యటన షెడ్యూల్ ఖరారైంది.

నేడు, రేపు కుప్పంలో చంద్రబాబు పర్యటన..

ఈ నెల 27న పలమనేరు, నగరి, నెల్లూరు రూరల్ లో చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఈ నెల 28న రాప్తాడు, కదిరి, శింగనమలలో ఎన్నికల ప్రచారం చేపడతారు. ఈ నెల 29న కర్నూలు, శ్రీశైలం, నందికొట్కూరులో చంద్రబాబు ఎన్నికల ప్రచారం కొనసాగనుంది. ఈ నెల 30న ప్రొద్దుటూరు, మైదుకూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తిలో… ఈ నెల 31న కావలి, ఒంగోలు, సంతనూతలపాడు, మార్కాపురంలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఇక, నేడు, రేపు చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించనున్నారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇది చదవండి: వైసిపీ నేత‌ల ఆత్మీయ స‌మావేశం..


మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


సాయికృష్ణ కేసులో కీలక పరిణామం.
సాయికృష్ణ కేసులో సీఐ నాగరాజు కస్టడీకి సంబంధించి ఏపీ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను సిట్ …
అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే.
నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని వరికుంటపాడు మండలం పెద్దిరెడ్డిపల్లి గ్రామంలో నిర్వహించిన శ్రీ అంకాలమ్మ తల్లి …
ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ నేడు మరోసారి ముంబైకి వెళ్లనున్నారు. కొంతకాలంగా రొటేటర్ కఫ్ …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

039494
Total views : 197152

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: