నేడు భూదాన్ పోచంపల్లి కి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము. ఉదయం పదకొండు గంటలకు రాష్ట్రపతి రాక. టై అండ్ డై ఇక్కత్ పట్టు చీరల తయారీ పరిశీలన చేయనున్న రాష్ట్రపతి. ప్రత్యేక ఆర్మీ చాపర్ లో హైదరాబాద్ నుంచి పోచంపల్లి కి చేరుకోనున్న పోచంపల్లి కి రాష్ట్రపతి. హెలిప్యాడ్ నుంచి ఇరవై ప్రత్యేక కార్లలో టూరిజం సెంటర్ కు రాష్ట్రపతి. భూదానోద్యమ కారులైన ఆచార్య వినోభాబావే ,భూదాత వెదిరే రాంచంద్రారెడ్డి విగ్రహాలకు పూలమాల వేయనున్న రాష్ట్రపతి. అనంతరం చేనేత కార్మికల దంపతులతో సమావేశం. చేనేత మాస్టర్ వీవర్ శివకుమార్ తోను ప్రత్యేక సమావేశం కానున్న రాష్ట్రపతి ముర్మ్. బాలాజీ పంక్షన్ హాల్ లో మగ్గాలు పరిశీలించి 350 ప్రత్యేక ఆహ్వానితులతో ముఖాముఖి. రాష్ట్రపతి తో కలిసి కేవలం ఆరుగురికి మాత్రమే వేదికపై ఆహ్వానం. గవర్నర్ తమిళి సై,రాష్ట్ర మంత్రులు సీతక్క ,తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య తో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఇద్దరు అధికారులకు అవకాశం. సుమారు గంట నలభై నిమిషాల పాటు భూదాన్ పోచంపల్లి లో గడపనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము భూదాన్ పోచంపల్లి పర్యటన
99
previous post