రూ. 90 నాణెం(Rs 90 Coin)ను తయారు చేసిన ఆర్బీఐ(RBI)..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(Reserve Bank of India) 90వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని రూ. 90 విలువైన ప్రత్యేక నాణేన్ని తయారు చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ ప్రత్యేక నాణేన్ని విడుదల చేశారు. నాణెం విడుదల కార్యక్రమంలో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తదితరులు హాజరయ్యారు. రూ. 90 నాణేన్ని 99.99 శాతం స్వచ్ఛమైన వెండితో తయారు చేశారు. ఈ నాణెం బరువు 40 గ్రాములు. ఈ నాణెంపై ఆర్బీఐ చిహ్నం ఉంటుంది. ఈ నాణేన్ని ఒక ప్రత్యేకమైన జ్ఞాపకార్థంగా తయారు చేశారు. ఈ నాణెం ప్రజలకు అందుబాటులో ఉండదు.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇది చదవండి: అమెరికాలో భారతీయ విద్యార్థులపై దాడులు..!
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి