లోక్‌సభ ఎన్నికలు-2024లో భాగంగా నేడు మూడో దశ పోలింగ్ కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని మొత్తం 93 లోక్‌సభ నియోజకవర్గాలకు ఉదయం 7 గంటలకు ఓటింగ్ మొదలైంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్నికల సంఘం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. కట్టుదిట్టమైన భద్రత మధ్య ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్తున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఈ 93 స్థానాల్లోని 72 సీట్లను బీజేపీ గెలుచుకుంది. ఒక్క గుజరాత్‌లోనే ఆ పార్టీ 26 సీట్లను దక్కించుకుంది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మూడవ దశలో అసోం- 4 సీట్లు, బీహార్-5, ఛత్తీస్‌గఢ్ -7, గోవా-2, గుజరాత్-26, కర్ణాటక-14, మధ్యప్రదేశ్-8, మహారాష్ట్ర-11, ఉత్తరప్రదేశ్ -10, పశ్చిమ బెంగాల్-4, కేంద్ర పాలిత ప్రాంతాలైన దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ-2లలో పోలింగ్ జరుగుతోంది. మరోవైపు మధ్యప్రదేశ్‌లోని బేతుల్ లోక్‌సభ స్థానానికి కూడా పోలింగ్ మొదలైంది. రెండో దశలోనే ఇక్కడ ఎన్నికలు జరగాల్సి ఉన్నప్పటికీ బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థి మరణించడంతో మూడో దశకు వాయిదా వేయాల్సి వచ్చింది. ఈ దశలో మొత్తం13 వందల మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో సుమారు 120 మంది మహిళలు ఉన్నారు.
- వయోవృదులందరికి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య భీమాదేశంలో ఉన్న 70 ఏళ్లు పైబడిన వయోవృదులందరికి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య భీమా పథకాన్ని వర్తింపజేయాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 6 కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు లబ్ది చేకూరుతుంది. వీరందరికీ…
- బెంగుళూరు రేవ్ పార్టీ కేసులో మరో సంచలనంబెంగళూరు రేవ్ పార్టీ కేసులో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. తాజాగా నటి హేమ రేవ్ పార్టీలో పాల్గొన్నారని, డ్రగ్స్ సేవించారని బెంగళూరు పోలీసులు స్టేట్మెంట్ ఇచ్చారు. ఆమె ఎండీఎంఏ డ్రగ్‌ను తీసుకున్నట్లుగా ఆధారాలను సేకరించి అందుకు సంబంధించిన…
- అత్యుత్తమ దేశాల జాబితాలో టాప్ లో స్విట్జర్లాండ్ప్రపంచ దేశాలలో అత్యుత్తమ దేశంగా ‘స్విట్జర్లాండ్’ మరోసారి నిలిచింది. బెస్ట్ కంట్రీస్ ర్యాంకింగ్స్ లో వరుసగా మూడోసారి నెంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకుంది. అందమైన పర్యాటక ప్రాంతాలతో పాటు జీవన ప్రమాణం, నాణ్యత, సంస్కృతి తదితర అంశాల ఆధారంగా…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.