92
డిసెంబర్ 3 తర్వాత సీఎం కేసీఆర్ కొత్త కార్యక్రమం చేపట్టనున్నారన్నారు మంత్రి కేటీఆర్. అదే సౌభాగ్య లక్ష్మీ అని తెలిపారు. ప్రతి నెల తెలంగాణ ఆడబిడ్డలందరికీ 3వేల రూపాయలను ఇవ్వనున్నారన్నారు. కామారెడ్డి జిల్లా భిక్కనూరు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఈ విధంగా తెలిపారు. అలాగే ఆసారా ఫించన్లను 2వేల రూపాయల నుండి దశల వారీగా 5వేలకు పెంచుతాన్నామన్నారు. 65 ఏళ్లలో కాంగ్రెస్ చేయలేని పనులు ఈ తొమ్మిదిన్నరేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందన్నారు. కొంతమంది లేనిపోని అసత్య ప్రచారాలు చేస్తున్నారని, అసైన్డ్ భూములు ఉన్న వారికే పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఏ రాష్ట్రంలోను బీడీ కార్మికులకు పెన్షన్ ఇవ్వరని, కేసీఆర్ ఇస్తున్నారన్నారు.
Read Also..
Read Also..