శ్రీ సత్య సాయి జిల్లా రామగిరి మండలం గంగంపల్లి గ్రామానికి చెందిన నవ దంపతులు తోటలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. గంగంపల్లి గ్రామానికి చెందిన దాదా (30) అనే యువకుడు జోత్స్న (26) అనే యువతి గత కొంతకాలంగా ప్రేమించుకునేవారు అయితే రెండు నెలల ముందు ఇంట్లో నుంచి పారిపోయి ప్రేమ వివాహం చేసుకొని మరి గ్రామానికి తిరిగి వచ్చారు. ఇరు కుటుంబాల్లో కొద్దిరోజులు స్వల్పవివాదం నెలకొంది. కొద్దిరోజుల తర్వాత గ్రామ పెద్దల సమక్షంలో ఇరువు కుటుంబ సభ్యులు ఒప్పించి దాదా ఇంట్లోనే కాపురం ఉంటున్నారు. ఇంతలోనే ఏం జరిగిందో తెలియదు ఇద్దరూ కలిసి తోటకు వెళ్ళొస్తానని అక్కడికి వెళ్లి ఒక చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. వెళ్లిన వారు ఎంతసేపటికి ఇంటికి రాకపోయేసరికి కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా అంతలోనే ఇద్దరు చెట్టుకు వేలాడుతుండడం చూసి గ్రామస్తులకు తెలిపారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న రెండు నెలల్లోనే నవ వధువుల ఆత్మహత్య చూసి గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలలో మార్చురీ నిమిత్తం ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
నవ దంపతులు ఆత్మహత్య..
78
previous post