అక్రమాలకు అడ్డాగా మారిన బెంగళూరు – విజయవాడ గ్రీన్‌ ఫీల్డ్ హైవే..

Advertisements

<p>కడప జిల్లాలో నిర్మిస్తున్న గ్రీన్ ఫీల్డ్‌ నేషనల్‌ హైవే&&num;8230&semi; అక్రమాలకు రహదారిగా మారింది&period; పులివెందుల మైనర్ ఇరిగేషన్ శాఖ అధికారులు కాసుల వేటలో బిజిగా ఉంటే&period;&period; ఇంకో వైపు అక్రమార్కులు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడేందుకు సిద్ధమైపోతున్నారు&period; బెంగళూరు– విజయవాడ మధ్య నిర్మిస్తున్న గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే లో భారీ ఎత్తున అక్రమాలు జరుగుతున్నట్లు సీవీఆర్ న్యూస్‌ పరిశోధనలో వెల్లడైంది&period; ముఖ్యంగా రోడ్డు నిర్మాణం కోసం ఎర్రిపల్లి వంక నుంచి నాణ్యతలేని మట్టిని కాంట్రాక్టర్‌ సరఫరా చేస్తున్నట్లు తేలింది&period; అలాగే పులివెందుల సమీపంలోని వాగులు&comma; వంకలు&comma; చెరువులు నుంచి పెద్ద ఎత్తున మట్టిని రహదారి కోసం వాడతున్నట్లు స్పష్టమవుతోంది&period; నిత్యం వందలాది టిప్పర్లు ఈ మార్గంలో తిరుగుతున్నా&period;&period; కళ్ల ముందే అక్రమంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నా అధికారులకు ఏ మాత్రం పట్టడం లేదు&&num;8230&semi; SPOT<&sol;p>&NewLine;<p>ఎర్రిపల్లి వంక దగ్గరున్న మట్టి నాణ్యత ఎక్కువగా లేదని&period;&period; అది చాలా వదులుగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు&period; దీనితో రహదారిని నిర్మిస్తే&period;&period; కొద్ది రోజుల్లోనే కుంగిపోయే ప్రమాదం ఉందని అంటున్నారు&period; ఈ విషయం ఇక్కడి అధికారులకు కూడా బాగా తెలుసని అయినా ఉద్దేశపూర్వకంగానే వారు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి&period; ఈ మొత్తం వ్యవహారంలో పులివెందుల మైనర్‌ ఇరిగేషన్‌ శాఖ అధికారులే కీలక పాత్ర పోషిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి&period; దాడులు చేసి కట్టడి చేయాల్సిన అధికారులే మౌనం వహిస్తుండడంతో&&num;8230&semi; అక్రమార్కుల ఆటలు యథేచ్ఛగా సాగుతున్నాయి&period; దీనిపై తహసీల్దార్‌ వివరణ కోరితే&period;&period; నాణ్యత ప్రమాణాలు తమ పరిధిలోకి రావని&period;&period; నేషనల్‌ హైవే అథారిటీ అధికారులు చూసుకుంటారని చెబుతున్నారు&period;&period;<&sol;p>&NewLine;<p>ఇక RDO కూడా ఇదే తరహా స్పందన కనబరుస్తున్నారు&period; నాణ్యత గురించి సైట్‌ ఇంజినీర్లు పరిశీలించాలని&period;&period; వెంటనే వారికి తగిన సూచనలిస్తామని అంటున్నారు&period; పనులు త్వరగా ముగించాలన్న హడావుడిలో నాణ్యత పట్టించుకోకపోవడం సరికాదని RDO అంటున్నారు&&num;8230&semi;<&sol;p>&NewLine;<p>ఇక అటు చిన్న చిన్న కుంటల్లోని మట్టిని తరలిస్తున్నా మైనర్‌ ఇరిగేషన్‌ శాఖ అధికారులకు పట్టడం లేదు&period; ఇతర పనుల్లో బిజీగా ఉన్నామంటూ పొంతన లేని సమాధానాలు చెబుతున్నారు&period; ఇప్పటికే విజయవాడ- బెంగళూరు గ్రీన్‌ ఫీల్డ్‌ హైవేలో చేపట్టిన అండర్‌ బ్రిడ్జిలను స్థానిక ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు&period; ఈ వంతెనలు తక్కువ ఎత్తులో ఉన్నాయని&&num;8230&semi; గ్రామ ప్రజలు అంటున్నారు&period; జాతీయ హైవే నిర్మాణ పనుల్లో భారీ ఎత్తున అవినీతి జరుగుతున్నా అధికారులు కన్నెత్తి చూడడం లేదని&&num;8230&semi; పులివెందుల ప్రజలు మండిపడుతున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.