జిల్లా పంచాయతీరాజ్ పర్యవేక్షక ఇంజనీరు (ఎస్.ఈ) మూర్తి వ్యవహార శైలి పై పంచాయతీరాజ్ ఇంజనీర్లు, కార్యాలయ సిబ్బంది నిరసన తెలిపారు. ఎస్ఈ కార్యాలయం ముందు రాత్రి బయటాయించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ ఉద్యోగుల జేఏసీ నాయకుడు కేసిహెచ్ మహంతి మాట్లాడుతూ… ప్రభుత్వ ప్రాధాన్య భవనాల నిర్మాణ విషయంలో తమపై తీవ్ర ఒత్తిడి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పుడో 2019 నాటి వ్యయంతో ఇప్పుడు నిర్మాణాలు నిర్మించాలంటే ఎలా జరుగుతుందంటూ ప్రశ్నించారు. ఇప్పుడు భవన నిర్మాణ సామాగ్రి రేట్లు విపరీతంగా పెరిగాయి, కూలీ రేట్లు పెరిగాయి, అయినా వాటిని పెంచకుండా నిర్మాణాలు కొనసాగించాలని తమపై ఒత్తిడి తీసుకొస్తున్నారని పేర్కొన్నారు. జగన్ ఇల్లు నిర్మాణాలు, రైతు భరోసా కేంద్రాలు, సచివాలయాలు సకాలంలో నిర్మించకపోతే మీపై చర్యలు తీసుకుంటామని అధికారులు, జిల్లా కలెక్టర్ మమ్మల్ని వేధించడం తగదంటూ వాళ్ళ ఆవేదన వ్యక్తం చేశారు. గత వారం రోజులుగా తమ బాధలను వినాలని జిల్లా పరిషత్ ఆఫీసు వద్దకు వస్తే ఎస్ఈ దొరకటం లేదని ఆరోపించారు. వారానికి ఒకరోజు కార్యాలయానికి రాని ఎస్ఈ వైఖరితో తాము ఇబ్బందులకు గురవుతున్నామని వాపోయారు. ఇప్పటికే ఇద్దరు ఇంజనీర్లను సస్పెండ్ చేశారని, ఇంకా అందరిపై కూడా వేటు వేస్తామని అధికారులు బెదిరిస్తున్నారని మండిపడ్డారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపట్టేందుకు కార్యచరణ రూపొందిస్తున్నామని తెలిపారు..
ఎస్ఈ మూర్తి వ్యవహార శైలి పై కార్యాలయ సిబ్బంది నిరసన..
72
previous post