కాంగ్రెస్ నేత పవన్ ఖేరాకు చెక్కెదురు ,పవన్ ఖేరాకు ముందస్తు బెయిల్ నిరాకరణ …

Advertisements

<p>కాంగ్రెస్ నేత పవన్ ఖేరాకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది&period; అసోం సీఎం హిమంత బిశ్వశర్మ భార్యపై వ్యాఖ్యల కేసులో ముందస్తు బెయిల్‌ ఇచ్చేందుకు నిరాకరించింది గౌహతి కోర్టు&period; అస్సాం సీఎం భార్య రిణికి భూయాన్‌ శర్మకు పలు పాస్‌పోర్టులు ఉన్నాయని&comma; విదేశీ ఆస్తులు ఉన్నాయని ఆరోపించారు&period; వాటిని హిమంత తన అఫిడవిట్‌లో ప్రస్తావించలేదన్నారు&period; ఈ ఆరోపణలను సీఎం తోసిపుచ్చారు&period; ఈ క్రమంలో రిణికి భూయాన్‌ శర్మ ఫిర్యాదు మేరకు ఖేరాపై గౌహతిలో కేసు నమోదైంది&period; ఈ కేసు నమోదైన రాష్ట్రంలో సంబంధిత కోర్టును ఆశ్రయించడానికి అవకాశం కల్పిస్తూ&period;&period;వారం రోజులపాటు తాత్కాలిక ముందస్తు బెయిలును మంజూరుచేస్తూ తెలంగాణ హైకోర్టు ఇటీవల ఉపశమనం కల్పించింది&period; అయితే&comma; సుప్రీంకోర్టు ఆ తర్వాత దీనిపై స్టే విధించింది&period; బెయిల్‌ కోసం అస్సాంలోని న్యాయస్థానానికే వెళ్లాలని సూచించింది&period; ఈనెల 21à°¨ ఇరుపక్షాల వాదనలు విన్న గౌహతి హైకోర్టు తీర్పును రిజర్వ్‌ చేసింది&period; తాజాగా ముందస్తు బెయిల్‌ కోసం ఖేరా దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరిస్తూ తీర్పు వెలువరించింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.