అన్నమయ్య జిల్లా… రాయచోటి… ఎపిలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రజలు విసుగుపొయ్యారని ఎప్పుడప్పుడు ఎన్నికలు వస్తాయని ఎదురు చుస్తున్నారన్నారు రాజంపేట జనసేన నాయకులు మల్లిశెట్టి రమణ. అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలో జనసేన జనబాటను, పవనన్న ప్రజాబాట ప్రచారా కార్యక్రమాన్ని వారు చేపట్టడం జరిగిందన్నారు. అందులో బాగంగా మంగళవారం వీరబల్లి మండలం ఓదివీడు గ్రామంలో జనసేన నాయకుల, కార్యకర్తలతో కలిసి వారు ప్రచారం నిర్వహించారు. రాష్ట్రానికి చంద్ర బాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ల నాయకత్వం ఎంతో అవసరం అని రానున్న ఎన్నికలలో జనసేన, తెదాపా పార్టీల అభ్యర్ధులను ఆదరించాలంటూ తెదాపా, జనసేన ఆశయాలను ఇంటింటికి కరపత్రాలతో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతు వైసిపి ప్రభుత్వం అధికారంలో కి వచ్చి నాలుగన్నర ఏండ్లు అవుతున్నప్పటికీ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో విపలం అయ్యిందన్నారు. రాష్ట్రాన్ని అప్పుల ఉబిలోకి నెట్టి ప్రతి మనిషికి లక్షల్లో తలభారం మోపరన్నారు. రానున్న ఎన్నికలలో వైసిపి ప్రభుత్బం డబ్బులతో ఓట్లు కొనేందుకు సిద్దపడుతుందన్నారు. ఎపి లో పెట్టుబడులు పెట్టేందుకు కుడా ముందుకు రాని దుస్థితి నెలకొందన్నారు. ప్రజలు జనసేన, తెలుగుదేశం పార్టీ కి నీరాజనం పడుతున్నారని సంతోషం వ్యక్తం చేశారు. రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్ధిగా తెలుగుదేశం, జనసేన పార్టి తరపున ఎవ్వరికి కేటాయించిన కలిసి పని చేసి తిరతామన్నారు. వారి వెంట జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎన్నికల కోసం ఎదురుచూస్తున్న ప్రజలు
81
previous post