85
విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మహిళల కోసం నిర్మించిన పింక్ టాయిలెట్‌ను నగర ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి ప్రారంభించారు. బాలింతలు తమ బిడ్డలకు పాలిచ్చేందుకు వీలుగా, మహిళలు వ్యక్తిగత అవసరాలు తీర్చుకునేందుకు అనువుగా వీటిని నిర్మించినట్లు అధికారులు వెల్లడించారు.. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నగర మేయర్ రాయపాటి అరుణ., తూర్పు నియోజకవర్గం ఇంచార్జ్ అవినాష్ మరియు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.