ప్రధాని మోదీపై వ్యాఖ్యలు…

Advertisements

<p>ప్రధాని మోదీ ఉగ్రవాది అంటూ కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలను ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది&period; ఈ వ్యాఖ్యలపై 24 గంటల్లో వివరణ ఇవ్వాలని పేర్కొంటూ నోటీసులు జారీ చేసింది&period; కాంగ్రెస్‌ నేత వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పలువురు కేంద్ర మంత్రులు ఫిర్యాదు చేసిన కొన్ని గంటల్లోనే ఎన్నికల సంఘం నుంచి ఈ స్పందన వచ్చింది&period; తమిళనాడు&comma; పశ్చిమబెంగాల్‌లో గురువారం పోలింగ్‌ జరగనున్న వేళ కాంగ్రెస్‌ అధ్యక్షుడికి నోటీసులు వచ్చాయి&period; చెన్నైలో మంగళవారం జరిగిన ఎన్నికల ప్రచారంలో మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ&period;&period; అన్నాడీఎంకేపై విరుచుకుపడ్డారు&period; అన్నాదురై ఫొటో పెట్టుకునే అన్నాడీఎంకే నేతలు మోదీతో ఎలా చేతులు కలపగలరు&quest; అని ప్రశ్నించారు&period; సమానత్వంపై ఆయనకు నమ్మకం లేదంటూ మోదీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు&period; ఇవి దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపాయి&period; క్షమాపణలు చెప్పాలని బీజేపీ డిమాండ్‌ చేయగా తన వ్యాఖ్యల్లోని ఉద్దేశంపై ఖర్గే వివరణ ఇచ్చారు&period; మోదీని ఎప్పుడూ ఉగ్రవాది అనలేదని&comma; దేశ ప్రజాస్వామ్య స్వరూపాన్ని ఆయన టెర్రరైజ్‌ చేస్తున్నారని చెప్పడమే తన ఉద్దేశమని వివరించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.