జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రంలో బిఎస్ఎఫ్, జవాన్లతో పాటు సాయుధ పోలీసులు అంగడి బజార్ నుంచి బ్లాక్ చౌరస్తా వరకు కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా జగిత్యాల డిఎస్పి వెంకటస్వామి మాట్లాడుతూ …..ఈనెల 30న జరుగనున్న తెలంగాణ శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సమస్యత్మక ప్రాంతాలతో పాటు నేర చరిత్ర కలిగిన వ్యక్తులను గుర్తించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా ప్రత్యేక నిఘా వేసినట్లు జగిత్యాల డిఎస్పి వెంకటస్వామి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిఎస్ఎఫ్ కమాండెంట్ దీపంకర్,విద్యాసాగర్, మల్యాల సర్కిల్ ఇన్స్పెక్టర్ బిల్లా కోటేశ్వర్, ఆర్ఐ.వేణు, ఎస్సైలు అశోక్, వెంకట్రావు, సతీష్, కుమారస్వామి పాల్గొన్నారు.
ఎన్నికల నేపథ్యంలో కవాతు నిర్వహించిన పోలీసులు..
91
previous post