టీడీపీ మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం లో వీటిపిఎస్ బూడిద అక్రమ రవాణాపై నిరసన తెలిపేందుకు వస్తున్నమాజీమంత్రి ఉమాను ఇంటి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. గొల్లపూడిలో ఉమ నివాసం వద్దకు భవానీపురం పోలీసులు తెల్లవారుజామునే చేరుకున్నారు. బూడిద చెరువు వద్దకు వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో పోలీసుల తీరుకు నిరసనగా దేవినేని ఉమ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా దేవినేని మీడియాతో మాట్లాడారు. మంత్రి జోగిరమేష్, ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ బూడిద అక్రమరవాణాతో రోజు కి కోటిరూపాయలు అక్రమంగా ఆర్జిస్తున్నారని ఆరోపించారు. తాము ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారా అంటూ మండిపడ్డారు. అక్రమాలు మీకు, అరెస్ట్ లు మాకా అంటూ అధికారపార్టీ నాయకులపై ధ్వజమెత్తారు. బూడిద పై అధికారులు తో మాట్లాడనివ్వండని డిమాండ్ చేశారు.
ఉమామహేశ్వరరావు హౌస్ అరెస్ట్
62
previous post