శ్రీశైలం ఘాట్ రోడ్ లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 5 కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. వరుస సెలవులతో పాటు కార్తీక మాసం ముగుస్తుండటంతో శ్రీశైలం పుణ్యక్షేత్రానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఈ మేరకు వాహనాల రద్దీ పెరిగింది. శ్రీశైలం టోల్ గేట్, సాక్షి గణపతి, హఠకేశ్వరం ముఖద్వారం వరకూ వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహనాలను క్లియర్ చేసేందుకు పోలీసులు శ్రమిస్తున్నారు. అయినా ట్రాఫిక్ మరింతగా పెరుగుతోంది. శ్రీశైలం పుణ్యక్షేత్రానికి ఏపీ, తెలంగాణ, కర్ణాటక నుంచి భక్తులు కుటుంబ సభ్యులతో కలిసి భారీగా తరలివస్తున్నారు. ఈ రోడ్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. శ్రీశైలం ఘాట్ రోడ్డ మొత్తం సింగిల్ రోడ్డు కావడంతో వచ్చి, వెళ్లే వాహనాలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. ప్రత్యేక టీములతో ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- డేంజర్ లో హైదరాబాద్ …కొన్ని రోజులుగా వాతావరణంలో మీకు మార్పు గమనించారా . జలుబు ,దగ్గు ,తుమ్ములు వంటి సమస్యలు మీకు ఎదురయ్యాయా ?అసలు ఏం జరుగుతుందో తెలుసా.. మనం ప్రమాదంఅంచుల్లో పడిపోతున్నాం.. వెంటనే అప్రమత్తం అవ్వండి. కాలుష్యానికి బ్రాండ్ గా ఉన్నఢిల్లీ…
- శివనామస్మరణతో మార్మోగుతున్న ద్రాక్షారామంకార్తీక మాసంలో చివరి సోమవారం కావడంతో అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామంలోని శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి ఆలయం శివనామ స్మరణతో మార్మోగింది. తెల్లవారుజాము నుంచే మహిళలు గోదావరి నదిలో స్థానం ఆచరించి అరటి దొప్పలతో దీపాలు…
- నెరవేరనున్న ఏపీ ప్రజల చిరకాల వాంఛరైల్వే శాఖకు సంబంధించి రాష్ట్ర ప్రజల చిరకాల వాంఛ నెరవేరబోతోంది. ఏళ్లుగా ఊరిస్తున్న దక్షిణకోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు కీలక ముందడుగు పడింది. విశాఖ కేంద్రంగా జోన్ కార్యకలాపాల కోసం భవనాల నిర్మాణానికి రైల్వేశాఖ టెండర్లు ఆహ్వానించింది. జోన్…
- విజయవాడ మేయర్ కు పదవీ ముప్పువిజయవాడ నగరపాలక సంస్థలో మేయర్ కు పదవీ ముప్పు తప్పేలా లేదు. ఎన్నికలకు ముందు నగరపాలక సంస్థలో 49 మంది కార్పొరేటర్లతో ఉన్న వైసీపీ బలం ప్రస్తుతం 38కి తగ్గిపోయింది. వీరిలోనూ మరో 10 మందికిపైగా కూటమి పార్టీల…
- ఆదాయాన్ని పెంచడానికి .. సామాన్యులపై రోడ్ టాక్స్ భారంపెట్రల్, డీజిల్ తో నడిచే నూతన వాహనాలకు విధించే రోడ్ ట్యాక్స్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. పొరుగు రాష్ట్రాల్లో వాహనాల ద్వారా వస్తున్న ఆదాయం, రిజిస్ట్రేషన్ విధానం తదితర అంశాలపై రాష్ట్ర రవాణా…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి