పవిత్ర రంజాన్ మాసంలో ఇవాళ చివరి శుక్రవారం. ముస్లింలు జరుపుకునే జమ్మాత్-ఉల్-విదా ప్రార్థనల సందర్భంగా హైదరాబాద్ పోలీసులు నగరంలో భారీ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. చారిత్రాత్మక మక్కా మసీదుతో పాటు సికింద్రాబాద్‌లోని జామా మసీదు పరిసర ప్రాంతాల్లో వాహనాల రాకపోకలను నియంత్రించనున్నట్లు ప్రకటించారు. చార్మినార్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇవాళ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అన్ని రకాల వాహనాల రాకపోకలను నిలిపివేయనున్నారు. చార్మినార్ నుంచి మదీనా, ముర్గీ చౌక్, శాలిబండ వైపు వెళ్లే ప్రధాన రహదారులను పూర్తిగా మూసివేస్తున్నట్లు జాయింట్ పోలీస్ కమిషనర్ తెలిపారు. నయాపూల్ నుంచి చార్మినార్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను మదీనా జంక్షన్ వద్ద సిటీ కాలేజీ వైపు మళ్లిస్తారు. శాలిబండ, నాగులచింత వైపు నుంచి వచ్చే వాహనాలను హిమ్మత్‌పురా జంక్షన్ వద్ద హరిబౌలి వైపు పంపిస్తారు. చౌక్ మైదాన్ ఖాన్ నుంచి చార్మినార్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను కోట్లా అలీజా వైపు మళ్లిస్తారు. ఈ ఆంక్షల నేపథ్యంలో ఆర్టీసీ బస్సులను అఫ్జల్‌గంజ్ బస్టాప్ వద్దే నిలిపివేయనున్నారు. ప్రార్థనల కోసం వచ్చే భక్తుల సౌకర్యార్థం సౌత్ జోన్ పరిధిలో ఆరు చోట్ల ప్రత్యేక పార్కింగ్ సౌకర్యం కల్పించారు. అదేవిధంగా, సికింద్రాబాద్‌లోని జామా మసీదు వద్ద కూడా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. సుభాష్ రోడ్డును మూసివేసి, రాణిగంజ్, ప్యారడైజ్ వైపు ట్రాఫిక్‌ను మళ్లిస్తారు. జమ్మాత్-ఉల్-విదా సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఐచ్ఛిక సెలవు ప్రకటించింది. ప్రయాణికులు ఈ మార్పులను గమనించి, ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచించారు.
#traffic
శ్రీశైలం ఘాట్ రోడ్ లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 5 కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. వరుస సెలవులతో పాటు కార్తీక మాసం ముగుస్తుండటంతో శ్రీశైలం పుణ్యక్షేత్రానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఈ మేరకు వాహనాల రద్దీ పెరిగింది. శ్రీశైలం టోల్ గేట్, సాక్షి గణపతి, హఠకేశ్వరం ముఖద్వారం వరకూ వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహనాలను క్లియర్ చేసేందుకు పోలీసులు శ్రమిస్తున్నారు. అయినా ట్రాఫిక్ మరింతగా పెరుగుతోంది. శ్రీశైలం పుణ్యక్షేత్రానికి ఏపీ, తెలంగాణ, కర్ణాటక నుంచి భక్తులు కుటుంబ సభ్యులతో కలిసి భారీగా తరలివస్తున్నారు. ఈ రోడ్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. శ్రీశైలం ఘాట్ రోడ్డ మొత్తం సింగిల్ రోడ్డు కావడంతో వచ్చి, వెళ్లే వాహనాలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. ప్రత్యేక టీములతో ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ప్రపంచ తొలి ట్రిలియనీర్ మస్క్.ప్రముఖ వ్యాపార దిగ్గజం, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పారు. ఆయనకు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ ‘స్పేస్ఎక్స్’అమెరికా స్టాక్ మార్కెట్లో భారీ ఐపీఓగా లిస్ట్ అయిన తర్వాత, ప్రపంచంలోనే అత్యధిక సంపద కలిగిన మొదటి ‘ట్రిలియనీర్‌గా…
- వెనెజువెలా డ్రగ్స్ ముఠాపై అమెరికా కీలక ఆపరేషన్.మాదకద్రవ్యాల అక్రమ రవాణా ముఠాలపై అగ్రరాజ్యం అమెరికా మరోసారి ఉక్కుపాదం మోపింది. వెనెజువెలాకు చెందిన కరుడుగట్టిన డ్రగ్స్ గ్యాంగ్ ట్రెన్ డి ఆరాగ్వాపై చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్‌లో ఆ ముఠా కీలక నేత హెక్టర్ రస్తెన్‌ఫోర్డ్ గురెరో ఫ్లోర్స్ హతమైనట్లు అమెరికా…
- కాకినాడలో 17 ఏళ్ల బాలిక అనుమానాస్పద మృతి.కాకినాడ జిల్లాలో 17 ఏళ్ల బాలిక అనుమానాస్పద మృతి తీవ్ర కలకలం రేపుతోంది. ప్రేమ వ్యవహారం నేపథ్యంలో తమ కుమార్తెను యువకుడు ఉరివేసి హత్య చేశాడని బాలిక కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే దీనిని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోందంటూ ఆందోళన…
- ప్రకాశం జిల్లాలో వెలుగులోకి వైసీపీ నాయకుడి నిర్వాకం.ప్రకాశం జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. చీమకుర్తి మండలం తొర్రగుడిపాడు గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు బత్తుల సుబ్బారావుపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. జిల్లాలోని సింగరాయకొండ, ఉలవపాడు ప్రాంతాలకు చెందిన నాలుగు గిరిజన కుటుంబాలను పనుల నిమిత్తం గ్రామానికి రప్పించిన…
- కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి.ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ‘రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం’ పేరుతో తిరుపతి సమీపంలోని దామినేడులో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్. మాధవ్ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వ…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




Total views : 141462