తొలిదశ పోలింగ్ (Primary Polling) :
సార్వత్రిక ఎన్నికల తొలిదశ పోలింగ్ (Primary Polling) ప్రారంభం అయింది. తొలిదశలో 17 రాష్ట్రాలు, 4 యూటీల్లోని 102 ఎంపీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. తొలిదశ లోక్‌సభ ఎన్నికల బరిలో 1,652 మంది అభ్యర్థులు ఉన్నారు. నేడు 16.63 కోట్ల మంది ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 1.87 లక్షల పోలింగ్ కేంద్రాల్లో తొలిదశ పోలింగ్ కొనసాగనుంది. తమిళనాడులోని అన్ని స్థానాలకు తొలి దశలోనే పోలింగ్ జరగనుంది. అరుణాచల్ ప్రదేశ్‌లోని 50, సిక్కిలోని 32 అసెంబ్లీ స్థానాలకు నేడు పోలింగ్ జరగనుంది.
ఇది చదవండి : సీఎం జగన్‌పై దాడి కేసు.. నిందితుడికి 14 రోజలు రిమాండ్..!
అరుణాచల్‌ప్రదేశ్‌లో 60 స్థానాలకు గాను 10 స్థానాల్లో బీజేపీ ఏకగ్రీవం అయింది. 8 మంది కేంద్ర మంత్రుల భవితవ్యాన్ని తొలిదశలో ఓటర్లు తేల్చనున్నారు. ఎన్నికలు శాంతియుతంగా, సజావుగా జరిగేలా ఈసీ అన్ని చర్యలు చేపట్టింది. పోలింగ్ కేంద్రాల వద్ద కేంద్ర బలగాలతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసింది. సగానికి పైగా పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్, మైక్రో అబ్జర్వర్ల ఏర్పాటు చేశారు. తొలిదశ పోలింగ్ కోసం 361 మంది పరిశీలకులను ఈసీ నియమించింది. 5వేలకు పైగా పోలింగ్ కేంద్రాల్లో పూర్తిగా మహిళా అధికారులకు విధులు నిర్వహించే బాధ్యతలు అప్పగించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- ఆదాయాన్ని పెంచడానికి .. సామాన్యులపై రోడ్ టాక్స్ భారంపెట్రల్, డీజిల్ తో నడిచే నూతన వాహనాలకు విధించే రోడ్ ట్యాక్స్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. పొరుగు రాష్ట్రాల్లో వాహనాల ద్వారా వస్తున్న ఆదాయం, రిజిస్ట్రేషన్ విధానం తదితర అంశాలపై రాష్ట్ర రవాణా…
- JEE పరీక్షల షెడ్యూల్ విడుదల ..దేశవ్యాప్తంగా ఉన్న NITలు, IIITల్లో Btech, బీఆర్క్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) 2025 జవనరి సెషన్ కోసం దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. అయితే గడువు సమయం ముగిసే నాటికి దరఖాస్తు ప్రక్రియ ఊపందుకుంది.…
- రేపు సీఎంగా సోరెన్ ప్రమాణ స్వీకారం…జార్ఖండ్‌లో మరోసారి జార్ఖండ్ ముక్తి మోర్చా నేతృత్వంలోని ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ఈ నెల 28న హేమంత్ సోరెన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన ఇండియా కూటమి ఎమ్మెల్యేల సమావేశం…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: సార్వత్రిక ఎన్నికల తొలిదశ పోలింగ్ ప్రారంభం…