కడియం మండలం మురమండలో జరిగిన ట్రాక్టర్ చోరీ కేసులో నలుగురు ముద్దాయిలను అరెస్టు చేసి వారి వద్ద నుండి కొంతమేర చోరీ సొత్తును స్వాధీన పరచుకున్నట్లు కడియం సిఐ తిలక్, ఎస్సై మహమ్మద్ హస్పక్ తెలిపారు. ఈ కేసుకు సంబంధించి పోలీస్ స్టేషన్లో వారు వివరాలను వెల్లడిస్తూ గత నెల 4వ తేదీన మురమండ గ్రామంలో గన్ని రామారావు తన కౌలు పొలం వద్ద ఉంచిన ట్రాక్టర్ ను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించిపోయారని, ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, దీనిపై తన సిబ్బందితో ప్రత్యేక నిఘ ఏర్పాటు చేయగా, ఈనెల 22వ తేదీన మురమండలో అనుమానస్పదంగా సంచరిస్తున్న పోతశెట్టి విజయ రెడ్డి, పోతంశెట్టి సూర్య భాస్కర్ రెడ్డి, పోతంశెట్టి సాయి రామ రెడ్డి, పోసి శేఖర్ లను అదుపులోకి తీసుకుని విచారణ చేయగా ట్రాక్టర్ను తామే దొంగిలించినట్లు నేరం ఒప్పుకున్నారని తెలిపారు. అలాగే ఈ నేరంతో పాటు ఆగస్టు 31వ తేదీన కుతుకులూరు గ్రామానికి చెందిన మరొక ట్రాక్టర్ను, పెనుమట్ర మండలం జుట్టుగ గ్రామంలో ట్రక్కుతో ఉన్న మరో ట్రాక్టర్ను దొంగిలించినట్లు ముద్దాయి ఒప్పుకున్నట్లు తెలిపారు. అలాగే గత నెలలో లొల్ల, కేశవరం, చిన ద్వారపూడి గ్రామాల్లో గల పొలాల కల్లాల వద్ద ఉంచిన 50 ధాన్యం బస్తాలను దొంగిలించి వాటిని ఓ రైస్ మిల్లులో అమ్మినట్లు, అలాగే అదే నెలలో అనపర్తి మండలం అత్తమూరులో రోడ్డు ప్రక్కన ఉంచిన మూడు ట్రాక్టర్ ఐరన్ వీల్స్ ను దొంగిలించినట్లు ముద్దాయిలు తెలిపారని, దొంగలించిన వీటిలో రెండు ట్రాక్టర్ ట్రక్కులను 40 వేలు, 46 వేలకు పాత ఇనుప సామాను వ్యాపారికి విక్రయించినట్లు ముద్దాయిలు తెలిపారని, వాటిలో రెండు ట్రాక్టర్లను, ఐరన్ వీల్స్ ను, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనపరచుకుని నలుగురు ముద్దాయిలపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. ఈ కేసును చాకచక్యంగా దర్యాప్తు చేసిన సిఐ తిలక్, ఎస్ఐ మహమ్మద్ హస్పక్, కడియం పోలీస్ స్టేషన్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు.
చోరీ సొత్తు స్వాధీనం..
64