భూటాన్ లో ప్రధాని మోదీ(Prime Minister Modi) పర్యటన..
రెండు రోజుల పర్యటనకు గాను ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) హిమాలయ దేశం భూటాన్ కు బయల్దేరారు. షెడ్యూల్ ప్రకారం ఆయన నిన్ననే భూటాన్(Bhutan)కు వెళ్లాల్సి ఉంది. శనివారం నాడు భారత్ కు తిరుగుపయనం కావాల్సి ఉంది. అయితే, వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా ఉండటంతో ఆయన ప్రయాణ ఈరోజుకు వాయిదా పడింది. భూటాన్(Bhutan)కు బయల్దేరుతున్న సమయంలో మోదీ ఎక్స్ వేదికగా స్పందిస్తూ… ‘భారత్ – భూటాన్ దేశాల భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసే లక్ష్యంతో వివిధ కార్యక్రమాలకు హాజరవబోతున్నాను అని తెలిపారు. భూటాన్ రాజు గ్యాల్పో, ఆ దేశ ప్రధానితో చర్చల కోసం ఎదురుచూస్తున్నా’ అని ట్వీట్ చేశారు. భారత్ తన పొరుగు దేశాలతో ఐక్యతను పెంచుకోవడానికి ఎంతో ప్రాధాన్యతను ఇస్తోంది. ఇందులో భాగంగానే భూటాన్ తో కూడా పలు అంశాలపై మోదీ ద్వైపాక్షిక చర్చలు జరపబోతున్నారు. నైబర్ హుడ్ ఫస్ట్ పాలసీలో భాగంగా భూటాన్(Bhutan) లో మోదీ పర్యటిస్తున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: సుప్రీంకోర్టులో కేంద్రానికి ఊరట..
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి