భార‌త ఒలింపిక్స్ సంఘం సీఈఓగా ర‌ఘురామ్

Raghuram Iyer

Advertisements

&NewLine;<p>భారత ఒలింపిక్ అసోసియేషన్ కొత్త సీఈఓగా రఘురామ్ అయ్యర్ ఎంపికయ్యారు&period; గతంలో ఆయన రాజస్థాన్ రాయల్స్ సీఈఓగా పనిచేశారు&period; ఈ మేరకు ఒలింపిక్ అసోసియేషన్ ఓ ప్రకటనలో తెలిపింది&period; క్రీడా నిర్వహణలో రఘురామ్‌కు విశేష అనుభవం దృష్ట్యా ఆయన ఈ బాధ్యతలకు తగిన వ్యక్తి అని వెల్లడించింది&period; పలువురు అభ్యర్థులను ఇంటర్వ్యూ చేశాక రఘురామ్‌ను ఎంపిక చేసినట్టు వెల్లడించింది&period; ఆయన ఎంపిక ఏకగ్రీవమని కూడా పేర్కొంది&period; సీఈఓ నియామకంపై ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ పలుమార్లు గుర్తు చేసిన నేపథ్యంలో రఘురామ్ నియామకం జరిగింది&period; రాజస్థాన్ రాయల్స్‌కు సీఈఓగా పని చేసిన రఘురామ్ గతంలో అనేక కీలక బాధ్యతలు నిర్వహించారు&period; ఇండియన్ సూపర్ లీగ్స్‌లో భాగంగా ఏటీకే మోహన్ బగన్‌కు&comma; ఆర్‌పీఎస్‌జీ మేవరిక్స్ కు సేవలందించారు&period; కాగా&comma; అయ్యర్ ఎంపికను ఐఓసీ మాజీ అధ్యక్షురాలు పీటీ ఉష కూడా స్వాగతించారు&period; అయ్యర్‌కు స్పోర్ట్స్ రంగంపై లోతైన అవగాహన ఉందని పేర్కొన్నారు&period; ప్రపంచ క్రీడా రంగంలో భారత్ విజయాల దిశగా అయ్యర్ ఎంపిక ఓ కీలక ముందడుగు అని అభిప్రాయపడ్డారు&period; కాగా&comma; ఇప్పటివరకూ భారత్ ఒలింపిక్ అసోసియేషన్ సీఈఓ బాధ్యతలను ఆల్ ఇండియా ఫుట్ బాల్ ఫెడరేషన్ అధ్యక్షుడు&comma; ఐఓఏ జాయింట్ సెక్రెటరీ నిర్వహించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.