కేరళంలోని కన్నూరులో జరిగిన ఎన్నికల ప్రచార సభలో రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు..

Advertisements

<p>కేరళంలోని కన్నూరులో జరిగిన ఎన్నికల ప్రచార సభలో రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు&period; సీపీఐఎం ఏమాత్రం వామపక్ష పార్టీ కాదని&comma; అతివాద రైట్‌వింగ్‌ పార్టీ అని పేర్కొన్నారు&period; సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఆ పార్టీ నేతలు బీజేపీతో జత కట్టారని ఆరోపించారు&period; అందువల్లే కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్‌డీఎఫ్‌ విజయం సాధించాలని ప్రధాని కోరుకుంటున్నారని అన్నారు&period; దేశవ్యాప్తంగా మతం&comma; దేవుళ్ల గురించి మాట్లాడే ప్రధాని&comma; కేరళకు వచ్చినప్పుడు మాత్రం శబరిమల ఆలయంలో జరిగిన బంగారు తాపడాల స్కామ్ గురించి ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు&period; బంగారు తాపడాలు మాయమవడం వెనక సీపీఐ నేతల హస్తం ఉన్నందువల్లే ఈ విషయంలో బీజేపీ మౌనంగా ఉందని రాహుల్‌ అన్నారు&period; సీపీఐ&comma; బీజేపీతో జత కట్టడం ఆ పార్టీలోని కొందరు సీనియర్ నేతలకు నచ్చలేదని&period;&period; అందువల్లే వారు యూడీఎఫ్ మద్దతుతో స్వతంత్రులుగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని రాహుల్‌ ఆరోపించారు&period; మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన స్మార్ట్ సిటీ మిషన్‌ వల్ల ప్రజలకు ఎటువంటి ప్రయోజనం లేదని రాహుల్‌ అన్నారు&period; కొట్టాయం జిల్లాలోని పుతుప్పల్లి నియోజకవర్గంలో UDF అభ్యర్థికి మద్దతుగా రాహుల్ గాంధీ వీధుల్లో సైకిల్ తొక్కుతూ వినూత్న రీతిలో ప్రచారం నిర్వహించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.