ప్రయాణికులకు రైలు టికెట్ల రద్దు, రిఫండ్ విధానంలో కీలకమైన మార్పులు చేసింది..

Advertisements

<p>భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది&period; ప్రయాణికులకు రైలు టికెట్ల రద్దు&comma; రిఫండ్ విధానంలో కీలకమైన మార్పులు చేసింది&period; కొత్త నిబంధనల ప్రకారం&comma; రైలు బయలుదేరడానికి 8 గంటలలోపు కన్ఫర్మ్ టికెట్‌ను రద్దు చేసుకుంటే ప్రయాణికులకు ఎలాంటి రిఫండ్ లభించదు&period; గతంలో ఈ గడువు 4 గంటలుగా ఉండేది&period; ప్రయాణానికి 8 గంటల నుంచి 24 గంటల మధ్యలో టికెట్‌ను రద్దు చేస్తే టికెట్ ధరలో 50 శాతం మాత్రమే తిరిగి వస్తుంది&period; అదేవిధంగా&comma; 24 గంటల నుంచి 72 గంటల ముందు రద్దు చేసుకుంటే 25 శాతం కోత విధించి&comma; 75 శాతం మొత్తాన్ని రిఫండ్ చేస్తారు&period; ఒకవేళ ప్రయాణానికి 72 గంటల కంటే ముందే టికెట్‌ను రద్దు చేస్తే కేవలం సాధారణ రద్దు ఛార్జీలు మాత్రమే వర్తిస్తాయి&period;<&sol;p>&NewLine;<p>అయితే టికెట్ ఏజెంట్లు&comma; దళారులు పెద్ద సంఖ్యలో టికెట్లను బ్లాక్ చేసి&comma; చివరి నిమిషంలో రద్దుచేయడాన్ని అరికట్టేందుకే ఈ కొత్త విధానాన్ని తీసుకొచ్చినట్లు రైల్వే శాఖ తెలిపింది&period; దీనివల్ల నిజమైన ప్రయాణికులకు చివరి నిమిషంలో కూడా బెర్తులు అందుబాటులోకి వస్తాయని అధికారులు భావిస్తున్నారు&period; ఈ కొత్త నిబంధనలు నేటి నుంచి 15 వరకు దేశవ్యాప్తంగా దశలవారీగా అమలు కానున్నాయి&period; ప్రయాణికులు ఈ మార్పులను గమనించి&comma; తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని రైల్వే అధికారులు సూచిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.