ఇటీవల శ్రీశాంత్‌తో మైదానంలో గంభీర్ గొడవ

Sreesanth and Gambhir

Advertisements

&NewLine;<p>టీమిండియా మాజీ ఆటగాళ్లు శ్రీశాంత్-గౌతం గంభీర్ ఇద్దరూ ఇటీవల వార్తల్లోకి ఎక్కారు&period; లెజండ్స్ లీగ్ క్రికెట్‌ 2023లో భాగంగా ఇటీవల సూరత్‌లోని లాలాభాయ్ కాంట్రాక్టర్ స్టేడియంలో ఇండియా కేపిటల్స్&comma; గుజరాత్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరిగింది&period; ఈ సందర్భంగా గంభీర్&comma; శ్రీశాంత్ మైదానంలోనే ఒకరికొకరు కలబడ్డారు&period; ఎలాంటి కవ్వింపు చర్యలు లేకుండానే గంభీర్ తనను రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడని శ్రీశాంత్ ఆగ్రహం వ్యక్తం చేశాడు&period; గంభీర్‌కు సహచరులను గౌరవించడం తెలియదని ఆరోపించాడు&period; ఐపీఎల్‌లో ఆర్సీబీ- లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లోనూ ఇలాంటి గొడవే జరిగింది&period; కోహ్లీతో నవీనుల్ హక్&comma; గంభీర్ వాగ్వివాదానికి దిగారు&period; ఇది అప్పట్లో సంచలనమైంది&period; ఈ ఘటనపై గంభీర్ తాజాగా ఓ ఇంటర్యూలో మాట్లాడుతూ&period; మెంటార్‌గా తన జట్టు ఆటగాళ్లకు అండగా ఉండాల్సిన బాధ్యత తనపై ఉంటుందన్నాడు&period; మ్యాచ్ జరుగుతున్నప్పుడు మధ్యలో జోక్యం చేసుకునే హక్కు తనకు ఉండదని కానీ&comma; మ్యాచ్ ముగిశాక తమ ఆటగాళ్లతో ఎవరైనా వాగ్వివాదానికి దిగితే వెళ్లి అడ్డుకోవడం తన బాధ్యత అని చెప్పుకొచ్చాడు&period; అటువైపు ఉన్నది ఎవరైనా సరే తమ ప్లేయర్లను కాపాడుకోవడం తన బాధ్యత అని తేల్చి చెప్పాడు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.