84
ఏలూరు జిల్లాలో పది విడతల్లో అపహరణకు గురైన 2,71,19,684 రూపాయలు విలువచేసే సెల్ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేసినట్లు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి తెలిపారు. ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ మేరీ ప్రశాంతి జిల్లాలో సెప్టెంబర్, అక్టోబరు నెలల్లో సెల్ ఫోన్లు పోగొట్టుకున్న వారికి రికవరీ చేసిన సెల్ఫోన్లను ఆమె అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పోలీస్ శాఖ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ 955035100 నెంబర్ ద్వారా అందుకున్న ఫిర్యాదులతో సేకరించిన సెల్ఫోన్లను ఆయా యజమానులకు అందజేసినట్లు తెలిపారు. మొత్తం 147 సెల్ ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అందజేసినట్లు వెల్లడించారు. రికవరీ చేసిన సెల్ ఫోన్ల విలువ రూ. 28.66 లక్షలు ఉంటుందని ఆమె వెల్లడించారు.