57
పల్నాడు జిల్లా వినుకొండ మండలం పిట్టంబండ ఉమ్మడివరం మధ్య ప్రవహిస్తున్న కుంకేరవాగు నీరు పొంగి రోడ్డుమీదికి రావడం వల్ల వినుకొండ మిద నుండి ప్రకాశం జిల్లా అద్దంకి, ఒంగోలు మీదుగా వెళ్ళే రహదారిని నిలుపదలచేసి కుర్చేడు, దర్శి మీదుగా వాహనాలను మళ్ళించారు. గతంలో కూడా వర్షాలు కురిసిన సమయంలో ఈ వాగులో ఒక కార్ కొట్టుకు పాయిన సంఘటన చోటు చేసుకుంది. మీచౌoగ్ తూఫాన్ కారణంగా ప్రజలు గమనించి కుంకేరవాగు వైపు వెళ్ళకుండా దారి మలుచుకోవాలని వినుకొండ టౌన్ సి ఐ సాంబశివరావు తెలిపారు. వాగు దగ్గర ఎలాంటి అవాంచనీయ సంఘటన జరగకుండా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.