78
బిజినేపల్లి మండలం వట్టెం శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయ పడిన సంఘటన చోటుచేసుకుంది. వట్టెం రామ్ రెడ్డి పల్లి తండా కు చెందిన బొగ్గు రామస్వామి(30) బొగ్గు నరసింహ(65) లు నాగర్ కర్నూల్ కు మోటార్ సైకిల్ పై వస్తుండగా వెనక నుండి నాగర్ కర్నూల్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను వెంటనే స్థానికులు నాగర్ కర్నూల్ జిల్లా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. నాగర్ కర్నూల్ లో ప్రధమ చికిత్స అందించి బాధితులను మెరుగైన చికిత్సల నిమిత్తం వెంటనే హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు బిజినపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.