భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రెచ్చిపోతున్నఇసుకాసురులు..

Advertisements

<p>భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అక్రమ ఇసుక దందా మరింత విస్తరిస్తోంది&period; ముఖ్యంగా అశ్వాపురం మండలంలో ఇసుకాసురులు రెచ్చిపోతూ ప్రభుత్వానికి భారీ నష్టం కలిగిస్తున్నారు&period; దశాబ్దాలుగా నిర్మాణంలో ఉన్న సీతారామ ప్రాజెక్ట్ ఇప్పుడు అక్రమ కార్యకలాపాలకు కేంద్రబిందువుగా మారింది&period; ప్రాజెక్ట్ వెనుక బ్యాక్ వాటర్ స్టోరేజ్ పేరుతో గోదావరి విస్తరణ చేపడుతున్నామని చెప్పుకుంటూ&comma; టెండర్ ప్రక్రియ లేకుండా డిసిల్టేషన్ పేరుతో అనుమతులు పొందుతున్నారు&period; గిరిజన సొసైటీల పేరుతో బినామీ కాంట్రాక్టర్లు రంగంలోకి దిగి భారీగా ఇసుక తరలిస్తున్నారు&period; కోర్టులో ప్రాజెక్ట్ పై కేసు కొనసాగుతున్న సమయంలో ఇలాంటి అనుమతులు ఎలా వచ్చాయన్నది పెద్ద ప్రశ్నగా మారింది&period; ఒకవైపు ప్రజలకు నీటిని అందించాల్సిన ప్రాజెక్ట్ పనులు నిలిచిపోతే&comma; మరోవైపు అదే ప్రాజెక్ట్ ప్రాంతం అక్రమ దందాలకు వేదిక కావడం ఆందోళన కలిగిస్తోంది&period; స్థానికులు&comma; గిరిజన సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు&period; అధికారులు చర్యలు తీసుకోకపోవడం పరిస్థితిని మరింత అనుమానాస్పదంగా మారుస్తోంది&period;<&sol;p>&NewLine;<p>సీతారామ ప్రాజెక్ట్ చుట్టూ జరుగుతున్న ఇసుక దందా వెనుక భారీ కుట్ర ఉన్నట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి&period; గోదావరి నదిలోపలే రహదారులు నిర్మించి భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు నిర్వహించడం చూస్తుంటే ఇది చిన్నస్థాయి వ్యవహారం కాదని స్పష్టమవుతోంది&period; డిసిల్టేషన్ పేరుతో లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను ఎత్తుకెళ్తున్నా&comma; ఎన్ని అనుమతులు ఇచ్చారు&comma; కాలపరిమితి ఎంత అన్న వివరాలు బయటకు రావడం లేదు&period; కొంతమంది ప్రజాప్రతినిధులు&comma; అధికారుల ప్రమేయం ఉందనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి&period; అక్రమ ఇసుక రవాణాను అరికట్టాల్సిన ఆయా శాఖలు కనీసం స్పందించకపోవడం ప్రజల్లో అనుమానాలకు తావిస్తోంది&period; దింతో ప్రభుత్వానికి రావాల్సిన కోట్ల రూపాయల ఆదాయం మాఫియా చేతుల్లోకి వెళ్తోంది &period; పారదర్శకత లేకపోవడం&comma; సమాచారాన్ని దాచిపెట్టడం వల్ల మొత్తం వ్యవహారం మరింత వివాదాస్పదంగా మారింది&period; ఈ పరిస్థితుల్లో జిల్లా అధికారులు తక్షణమే జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని స్థానికులు అంటున్నారు &period;<br &sol;>&NewLine;జిల్లాలోని కిన్నెరసాని&comma; మొర్రేడు వాగులు కూడా అక్రమ ఇసుక రవాణాకు కేంద్రాలుగా మారాయి&period; చీకటి పడితే చాలు జెసిబి యంత్రాలతో ఇసుక తవ్వకాలు ప్రారంభమవుతాయి&period; ట్రాక్టర్ల ద్వారా ఒడ్డుకు చేర్చి&comma; అక్కడి నుంచి లారీలలో లోడ్ చేసి సమీప పట్టణాలకు తరలిస్తున్నారు&period; కొత్తగూడెం&comma; పాల్వంచ&comma; ఖమ్మం ప్రాంతాలకు ఈ ఇసుక సరఫరా అవుతోందని సమాచారం&period; ఇది పూర్తిగా ప్రణాళికాబద్ధంగా జరుగుతున్న అక్రమ వ్యాపారం అని స్థానికులు చెబుతున్నారు&period;దీనిపై అధికారులను వివరణ అడిగితే సిబ్బంది కొరత&comma; రాత్రివేళల్లో పర్యవేక్షణ చేయలేమని సమాధానాలు చెబుతున్నారు &period; కానీ ఇంత పెద్ద స్థాయిలో జరుగుతున్న దందా వారికి తెలియకుండా జరుగుతుందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి&period; ప్రజలు ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ చర్యలు తీసుకోకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది&period; ఇది కేవలం ఇసుక దోపిడీ మాత్రమే కాదు&comma; ప్రకృతి సంపదల నాశనంగా కూడా భావించాల్సి ఉంటుందని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు &period;దీనిపై అధికారులను వివరణ అడిగితే అలాంటివి ఉంటే చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు &period;<br &sol;>&NewLine;డిసిల్టేషన్ పేరుతో జరుగుతున్న ఈ అక్రమ ఇసుక రవాణా పై గిరిజన సంఘాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి&period; వెంటనే విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను డిమాండ్ చేస్తున్నారు&period; సీతారామ ప్రాజెక్ట్‌పై కోర్టు స్టే ఉన్న సమయంలో&comma; అదే ప్రాంతంలో ఇసుక తవ్వకాలకు అనుమతులు ఇవ్వడం చట్టబద్ధమేనా అన్నది ప్రధాన ప్రశ్నగా మారింది&period; ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం కోల్పోతుండగా&comma; కొందరు వ్యక్తులు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి&period; అధికారులు స్పందించకుండా ఉండటం&comma; ఫోన్లు ఎత్తకపోవడం&comma; కార్యాలయాల్లో అందుబాటులో లేకపోవడం వంటి అంశాలు పరిస్థితిని మరింత అనుమానాస్పదంగా మారుస్తున్నాయి&period; పారదర్శకత లేకుండా కొనసాగుతున్న ఈ వ్యవహారం పై సమగ్ర విచారణ జరిపి నిజాలు బయటపెట్టాలని ప్రజలు కోరుతున్నారు&period; లేకపోతే ఇలాంటి అక్రమాలు మరింత పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.