76
కడప జిల్లా… సీఎం జగన్ అబద్ధపు ప్రకటనలు, మాయమాటలతో రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్య కుమార్ అన్నారు. కడపజిల్లా ప్రొద్దుటూరు సుందరయ్య కాలనీలోని 160 కుటుంబాలు బీజేపీలో చేరడంతో సత్య కుమార్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కేంద్రం రాష్ట్రానికి 25 లక్షల ఇళ్లు మంజూరు చేస్తే మూడు లక్షల ఇళ్లు మాత్రమే కట్టేమని వైసీపీ ప్రభుత్వం చెబుతోందని అవి ఎక్కడ ఉన్నాయో కూడా తెలియదన్నారు. పేదలకు మంచి చేయలేదు కాబట్టే జగన్ పరదాల చాటున తిరుగుతున్నారన్నారు. పేదల కోసం కేంద్రం ఇస్తున్న బియ్యాన్ని కూడా స్వాహా చేస్తున్నారని ఆరోపించారు. ఎక్కడెక్కడ ఉన్న భూములను కబ్జా చేస్తున్నారని అయన విమర్శంచారు.