బయట చూస్తే SBI ATM..

బయట చూస్తే SBI ATM

Advertisements

<p>బోర్డు చూస్తే ఎస్‌బీఐ ఏటీఎం&period;&period; లోపలికి వెళ్తే కటింగ్‌ షాపు&period;&period;&excl; బీహార్‌లోని పాట్నా సమీపంలో ఉన్న దానాపూర్‌లో వెలుగుచూసిన ఈ విచిత్రమైన వీడియో&period;&period; ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్లను పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తోంది&period; దానాపూర్‌లోని ఒక రూమ్‌లో గతంలో ఎస్‌బీఐ ఏటీఎం ఉండేది&period; అయితే కొన్ని కారణాల వల్ల బ్యాంక్ దాన్ని మూసేసి&period;&period; ఆ ఖాళీ స్థలాన్ని వేరొకరికి అద్దెకు ఇచ్చింది&period; కానీ&comma; బయట ఉన్న &OpenCurlyQuote;స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం’ బోర్డును తీసేయడం బ్యాంకు అధికారులు మర్చిపోయారు&period; అయితే ఆ స్థలాన్ని అద్దెకు తీసుకున్న వ్యక్తి&period;&period; బోర్డు అలాగే ఉంచి&comma; లోపల ఏకంగా అద్దాలు&comma; కుర్చీలు వేసి సెలూన్ షాపు పెట్టేశాడు&period; దీంతో బయట నుంచి చూసి డబ్బుల కోసం లోపలికి వెళ్లిన జనం&period;&period; అక్కడ హెయిర్ కటింగ్ చూసి బిత్తరపోతున్నారు&period; ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో మీమర్స్ పండగ చేసుకుంటున్నారు&period; బ్యాంకింగ్ భాషలో లోన్ల మాఫీని లేదా నష్టపోవడాన్ని &OpenCurlyQuote;హెయిర్ కట్’ అంటారని&period;&period; ఇప్పుడు ఎస్‌బీఐ ఆ పదానికి లైవ్‌లో సరికొత్త అర్థం చెబుతోందంటూ నెటిజన్లు ఓ రేంజ్‌లో సెటైర్లు వేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..