వైసీపీ ప్రభుత్వంలో రోజుకో స్కామ్

nadendla manohar

Advertisements

&NewLine;<p>వైసీపీ ప్రభుత్వంలో రోజుకో స్కామ్ అనే నినాదంతో రెండో రోజు ప్రెస్ మీట్లో ఇండస్ట్రీస్ శాఖలో కుంభకోణంపై నాదెండ్ల మనోహర్ వివరాలు వెల్లడించారు&period;<br>వైసీపీ ప్రభుత్వ కేబినెట్ న్యూ ఇండస్ట్రియల్ లాండ్ పాలసీ అనే విధానాన్ని ఆమోదించింది&period;&period; ఇది కేవలం సీఎం కి అత్యంత సన్నిహితమైన రెండు మూడు కంపెనీల కోసమే ఈ పాలసీ తీసుకువచ్చారు&period; ఈ పాలసీ పేరుతో వైసీపీ వాళ్ళు స్కాండల్స్ చేస్తున్నారు&period;&period; రామాయపట్నం పోర్టు దగ్గర ఇండోసోల్ అనే కంపెనీకి 5&comma;148 ఎకరాలు కేటాయించింది&period; తొలుత 10 సం&period; లీజు అని చెప్పారు&period; కొత్త పాలసీ పేరుతో ఆ కంపెనీ కాస్తా ఆ భూమికి లెస్సీ స్థాయి నుంచి ఓనర్ కి మారింది&period;&period; లీజు పేరుతో కేటాయించిన భూమి తాలూకు సర్వహక్కులను ఇండోసోల్ కి ధారదత్తం చేసి యజమానిని చేశారు&period;&period; అక్కడితో వీరి దోపిడీ ఆపలేదు&period; మరో 3200 ఎకరాలు పొందే విధంగా ప్రభుత్వమే ఫెసిలిటేటర్ గా వ్యవహరించబోతుంది&period; మొత్తంగా 8348 ఎకరాలను ఇండోసోల్ కి కట్టబెట్టారు&period;&period; ఇంతకీ ఈ ఇండోసోల్ సంస్థ వెనక ఉన్నది ఎవరంటే… షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్&period;&period; షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ ఎవరిదో కాదు ముఖ్యమంత్రి సన్నిహితులదే&period;&period; అసలు ఇండోసోల్ అనే సంస్థ పుట్టి ఈ రోజుకి 1 సంవత్సరం 9 నెలల 12 రోజులు అయింది&period;&period; అంటే ఏడాది కిందట సృష్టించిన డమ్మీ కంపెనీ పేరుతో భూ దోపిడీ కోసం న్యూ ఇండస్ట్రియల్ లాండ్ పాలసీ తెచ్చారు&period;&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.