68
పార్వతీపురం జిల్లాలో తుఫాను దృష్ట్యా జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ రేపు,ఎల్లుండి పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ. తుఫాను తీవ్రత దృష్ట్యా రెండు రోజులపాటు ఇళ్ల నుంచి బయటకు రావద్దని కలెక్టర్ నిశాంత్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జిల్లా యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉందని అన్నారు. జిల్లాలో ఎలాంటి ప్రాణ నష్టం, పంట నష్టం జరగకుండా ప్రతి అంశాన్ని పరిగణనలోకి తీసుకున్నామని తెలిపారు.