Wednesday, August 26, 2026
News Navigation
Wednesday, August 26, 2026
News Navigation

Breaking

Wednesday, August 26, 2026
Home Film తికమకతాండ సినిమా ట్రైలర్ లాంచ్ చేసిన విక్రమ్ కె కుమార్

తికమకతాండ సినిమా ట్రైలర్ లాంచ్ చేసిన విక్రమ్ కె కుమార్

by Rama
thikamakathnada

దర్శకుడు విక్రమ్ కె కుమార్ గారి చేతుల మీదగా తికమకతాండ సినిమా ట్రైలర్ లాంచ్ అయ్యింది. తికమక తండా దర్శకుడు వెంకట్ హీరోలు హరికృష్ణ, రామకృష్ణ హీరోయిన్లు యాని, రేఖ నిరోష విక్రమ్ కె కుమార్ గారిని కలిసి ట్రైలర్ చూపించి ట్రైలర్ లాంచ్ చేయించారు. ట్రైలర్ చూసిన విక్రమ్ కె కుమార్ గారు మూవీ టీం ని అభినందించారు. ఈ మూవీ నుంచి ఇప్పటివరకు విడుదలైన సాంగ్స్ మరియు టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అతి త్వరలో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించడానికి మూవీ టీం సిద్ధమయ్యారు. తికమకతాండ సినిమా ను డిసెంబర్ 15న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

విక్రమ్ కె కుమార్ గారు మాట్లాడుతూ : ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. వెంకట్ ఎంచుకున్న కాన్సెప్ట్ చాలా కొత్తగా అనిపించింది. హరికృష్ణ, రామకృష్ణ, యాని మరియు రేఖ నిరోష లకు ఈ సినిమా మంచి సక్సెస్ ఇవ్వాలి. అలాగే వెంకట్ కి సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు.

తిరుపతిసత్యం సమర్పిస్తున్నారు
నిర్మాత : తిరుపతి శ్రీనివాసరావు
దర్శకుడు : వెంకట్
నిర్మాణం: టి ఎస్ ఆర్ మూవీమేకర్స్
తారాగణం : హరికృష్ణ, రామకృష్ణ , యాని , రేఖ నిరోష
కథ : నిరూప్‌కుమార్‌
డి ఓ పి : హరికృష్ణన్
ఎడిటర్ : కుమార్ నిర్మలాసృజన్
సంగీత దర్శకుడు : సురేష్ బొబిల్లి
పి ఆర్ ఓ : మధు వి ఆర్

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: