‘విరూపాక్ష’ ఫేమ్ డైరెక్టర్ కార్తీక్ దండు సోదరుడు వివేక్ దండు హీరోగా పరిచయమవుతున్న సినిమా “పనసపల్లి ఫ్యాన్స్ అసోసియేషన్”. ఈ చిత్రంలో సంగీర్తన విపిన్ హీరోయిన్ గా నటిస్తోంది. సప్తగిరి ఒక ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని క్యాండిడ్ ఫిలింస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.1 గా ప్రొడ్యూసర్ వివేకానంద్ వర్మ నిర్మిస్తున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ పీరియాడిక్ ఎంటర్ టైనర్ గా ఈ మూవీని దర్శకుడు సి.హెచ్. రవికిషోర్ రూపొందిస్తున్నారు. ఈ రోజు “పనసపల్లి ఫ్యాన్స్ అసోసియేషన్” సినిమా మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ మోషన్ పోస్టర్ ఇంట్రెస్టింగ్ గా ఉండి ఆకట్టుకుంటోంది.
“పనసపల్లి ఫ్యాన్స్ అసోసియేషన్” సినిమా మోషన్ పోస్టర్ ఎలా ఉందో చూస్తే – పనసపల్లి ఊరు సినీ ప్రియులకు ప్రసిద్ధి. అక్కడ గోడలపై కొత్త సినిమాల పోస్టర్స్ పడాల్సిందే. హీరో పనసపల్లి మెగా కామ్రేడ్స్ ఫ్యాన్స్ సంఘానికి అధ్యక్షుడు, బాలయ్య అభిమాన సంఘం ప్రెసిడెంట్ హీరోయిన్. తమ హీరోల సినిమాలు సాధించే బాక్సాఫీస్ రికార్డులపై హీరో హీరోయిన్ పోటా పోటీలు పడటం మోషన్ పోస్టర్ లో ఆసక్తి కలిగిస్తోంది. ఈ ఫ్యాన్ వార్ ఎక్కడి దాకా వెళ్లింది, ఎలాంటి మలుపులు తిరిగింది, ఎలా వినోదాన్ని పంచింది అనేది సినిమాలో చూడాలి.
“పనసపల్లి ఫ్యాన్స్ అసోసియేషన్” సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మేకర్స్ త్వరలో వెల్లడించనున్నారు.