మెగా డీఎస్సీ ప్రక్రియపై వస్తున్న ఆరోపణలపై చర్చించేందుకు అసెంబ్లీకి రావాలని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి మంత్రి నారా లోకేశ్ ‘ఎక్స్’ (X) వేదికగా సవాల్ విసిరారు. జగన్ సమాధానం కోసం రెండో రోజూ ఎదురుచూస్తున్నానని, ప్రెస్‌మీట్‌లు కాకుండా దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలని ‘ఐ యామ్ వెయిటింగ్’ అంటూ ఒక మీమ్‌ను పోస్ట్ చేశారు.డీఎస్సీ విషయంలో వైసీపీ చేస్తున్న ఆరోపణలపై చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని మంత్రి మరోసారి స్పష్టం చేశారు. ఈ అంశంపై జగన్ చర్చకు వస్తారా? అంటూ గతంలోనే ప్రశ్నించిన ఆయన.. తాజాగా తన నిరీక్షణను తెలియజేస్తూ ఆసక్తికరమైన పోస్టు పెట్టారు.ఈ సందర్భంగా ‘మిస్టర్ బీన్’ మీమ్‌ను మంత్రి లోకేష్ షేర్ చేశారు. వైసీపీ కోసం ‘ఐ యామ్ వెయిటింగ్’ అనే భావన వచ్చేలా మీమ్‌ను రూపొందించి పోస్టు చేశారు. డీఎస్సీ అంశంపై చర్చకు జగన్ స్పందించకపోవడాన్ని ప్రస్తావిస్తూ ఈ పోస్టు చేశారు. దీనిని ‘#DSCFakesByYCP’ హ్యాష్‌ట్యాగ్‌తో షేర్ చేయగా.. సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. డీఎస్సీ అంశంపై అధికార, ప్రతిపక్షాల మధ్య ఇప్పటికే రాజకీయ విమర్శలు, ప్రతివిమర్శలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో లోకేష్ తాజా సవాల్‌పై వైఎస్ జగన్, వైసీపీ నుంచి ఎలాంటి స్పందన వస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
DSCపై చర్చకు రావాలని ‘X’లో జగన్‌కు మంత్రి లోకేశ్ సవాల్.
16
previous post