86
మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలోని బస్ స్టాండ్ నుండి కోటపల్లి మెడల్ స్కూల్ కి వెళ్లి చదువుకునే విద్యార్థులకు సరిపడ బస్సులు లేక తాము నానా ఇబ్బందులు ఎదుర్కుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వారు వినూత్నంగా బస్ స్టాండ్ లో వీవాంట్ బస్సెస్ అంటూ నినాదాలు చేశారు. ఉదయం వేళలో రెండు బస్ లు మాత్రమే అటుగా వెళుతాయని,దాంతో ప్రయాణికుల తాకిడితో మేము వెళ్లలేక పోతున్నామని వారు తెలిపారు. తాము పదవ తరగతి చదువుతున్నామని సమయానికి బస్సులు లేక స్కూల్ కి ఆలస్యంగా వెళ్లే పరిస్థితులు తలెత్తాయని విద్యార్థులు పేర్కొన్నారు. బస్సులు సంఖ్యను పెంచి తమకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు విద్యార్థులు వేడుకుంటున్నారు.