78
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ అష్టాదశ శక్తి పీఠాలలో ఐదవ శక్తి పీఠమైన శ్రీ జోగులాంబ దేవి, బాల బ్రహ్మేశ్వర ఆలయాలను మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ, కుమార్తె శ్రీజ కుటుంబ సమేతంగా ఆలయాలలో ప్రత్యేక పూజలు చేశారు. అంతకు ముందు వీరికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో అభిషేకాలు జోగులాంబ అమ్మవారి ఆలయంలో కుంకుమార్చన చేశారు. ఆలయాల విశిష్టతల గురించి అర్చకులు వారికి వివరించారు. ఈ ప్రాంతంలో 9 నవబ్రహ్మ ఆలయాలు ఉన్నాయని నవబ్రహ్మ ఆలయాల గురించి చిరంజీవి కుటుంబ తెలుసుకోవడంతో ఎంతో అద్భుతమైన శిల్ప కట్టడాలతో ఈ ప్రాంతంలో చాలా చక్కగా నిర్మించబడి ఉన్నాయని వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు.
Read Also..
Read Also..