కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్(KL Rahul Captain Innings), క్వింటన్ డికాక్ అర్ధసెంచరీ దన్నుతో ఐపీఎల్-2024లో లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Supergiants in IPL-2024) మరో విజయాన్ని నమోదు చేసింది. వరుస ఓటములతో సతమతమవుతున్న ఆ జట్టు చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings)పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సొంత మైదానంలో 177 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన లక్నో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 19 ఓవర్లలోనే ఛేదించింది. 53 బంతుల్లో 82 పరుగులు బాదిన కెప్టెన్ కేఎల్ రాహుల్ లక్నో గెలుపులో కీలక పాత్ర పోషించాడు.
ఇది చదవండి: LSG vs DC IPL 2024 | ఐపీఎల్ పదిహేడో సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ రెండో విజయం..
అతడి ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. ఇక ఓపెనర్ క్వింటన్ డికాక్ కూడా అర్ధ సెంచరీతో రాణించడంతో లక్నో గెలుపు సునాయాసమైంది. 31 బంతుల్లో 43 పరుగులే చేయాల్సిన కీలక స్థితిలో డికాక్ ఔటైనప్పటికీ పూరన్ 23 పరుగులతో నాటౌట్ గా నిలిచి రాహుల్‌తో కలిసి జట్టుని విజయతీరాలకు తీసుకెళ్లారు. 3 ఓవర్లలో 16 పరుగులు చేయాల్సిన సమయంలో రాహుల్ ఔట్ అయ్యాడు. అయితే స్టాయినిస్, పూరన్ కలిసి సులభంగా పరుగులు రాబట్టారు. చెన్నై బౌలర్లలో మతీశ పతిరన, ముస్తాఫిజుర్ చెరో వికెట్ తీశారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- IPL చరిత్రలోనే అత్యధిక ధర పలికిన పంత్..
- సెంచరీతో కొత్త రికార్డును సృష్టించిన విరాట్ కోహ్లీ
- టీమిండియా దెబ్బకు కుప్పకూలిన ఆసీస్
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి