పెర్త్ టెస్టులో టీమిండియా విజయానికి బాటలు పరుచుకుంటోంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుతున్న తొలి టెస్టులో టీమిండియా మ్యాచ్ ను శాసించే స్థితిలో నిలిచింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్ లో వికెట్ నష్టపోకుండా 172 పరుగులు చేసింది. తద్వారా భారత జట్టు ఓవరాల్ ఆధిక్యం 218 పరుగులకు పెరిగింది. ఆసీస్ తన తొలి ఇన్నింగ్స్ లో 104 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ బుమ్రా 5, కొత్త బౌలర్ హర్షిత్ రాణా 3, మహ్మద్ సిరాజ్ 2 వికెట్లు తీశారు. అనంతరం, రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియాకు… ఓపెనర్లు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ తిరుగులేని ఆరంభాన్నిచ్చారు. ఈ జోడీని విడదీసేందుకు ఆస్ట్రేలియా బౌలర్లు విఫలయత్నాలు చేశారు. రెగ్యులర్ బౌలర్లకు తోడు లబుషేన్, హెడ్ వంటి పార్ట్ టైమ్ బౌలర్లు బౌలింగ్ చేసినా వికెట్ పడలేదు. స్టార్క్, కమిన్స్, హేజిల్ వుడ్ వంటి స్టార్ పేసర్లు టీమిండియా ఓపెనర్ల ముందు తేలిపోయారు.
ఆట ముగిసే సమయానికి జైస్వాల్ 90, కేఎల్ రాహుల్ 62 పరుగులతో ఉన్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ఒకే వేదికపై పొన్నం, హరీశ్ రావురాజకీయాల్లో నిత్యం విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకునే నేతలు ఒకే వేదికపై సరదాగా గడిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి హరీశ్ రావు క్రికెట్ ఆడారు. ఓ కార్యక్రమానికి హాజరైన వీరిద్దరూ స్టేజిపై క్రికేట్ ఆడి అక్కడున్నవారిలో…
- ఈనెల 29 న ఏపీలో మోదీ పర్యటనకూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి సారి ఈ నెల 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పట్నానికి రానున్నారు . ఈ నెల 29న విశాఖకు రానున్న మోదీ. ఆంధ్రా యూనివర్శిటీలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు.…
- శ్రీశైలం ఘాట్ రోడ్డులో 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్శ్రీశైలం ఘాట్ రోడ్ లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 5 కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. వరుస సెలవులతో పాటు కార్తీక మాసం ముగుస్తుండటంతో శ్రీశైలం పుణ్యక్షేత్రానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఈ మేరకు వాహనాల…
- మద్యం మత్తులో మందుబాబు … ట్రాఫిక్ పోలీసులకు చుక్కలుహైదరాబాద్ లోని చంపాపేట్‌లో శనివారం రాత్రి మద్యం సేవించి ఓ వ్యక్తి స్కూటీపై వచ్చాడు. చెకింగ్ చేస్తున్న మీర్‌చౌక్ పోలీసులు అతన్ని ఆపారు. బ్రీత్ ఎనలైజర్ పరీక్షలో మద్యం మత్తులో ఉన్నట్లు నిర్దారించారు. దీంతో ట్రాఫిక్ పోలీసులకు డ్రంకెన్…
- చివరి దశకు చేరుకున్న సమగ్ర కుటుంబ సర్వేసమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే చివరి దశకు చేరుకుంటుందని, సర్వే డేటా ఎంట్రీ చాలా కీలకమైందని, ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం ఇవ్వవద్దని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. రాంచీ నుంచి సమగ్ర కుటుంబ సర్వేపై జిల్లా కలెక్టర్లతో…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి